US Visa: రికార్టు సృష్టించిన అమెరికా ఎంబసీ.. ఈ ఏడాది 10 లక్షల వీసాలు జారీ

భారత్‌లోని అమెరికా ఎంబసీ ఓ కొత్త రికార్డును సృష్టించింది. ప్రస్తుత సంవత్సరంలోని అన్ని రకాల కలిపి మిలియన్‌ వీసాలను జారీ చేయాలనే తమ లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ఈ ఏడాది ఇప్పటిదాక భారతీయులకు జారీ చేసిన వీసాల సంఖ్య 10లక్షలు దాటిపోయింది. ఈ విషయాన్ని అమెరికా రాయబార కార్యాలయం తన అధికారిక సామాజిక మాధ్యమం వేదికగా తెలిపింది. Missionto1M పూర్తయ్యిందని.. ఇండియాలో ఈ ఏడాది వీసాల ప్రక్రియలో మేం పెట్టుకున్న ‘మిలియన్‌ వీసాల జారీ’ లక్ష్యాన్ని దాటేశామని తెలిపింది. అయితే, ఇక్కడితోనే మేం ఆగిపోమని.. అలాగే రాబోయే నెలల్లో కూడా మరింత వృద్ధిని సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది.

US Visa: రికార్టు సృష్టించిన అమెరికా ఎంబసీ.. ఈ ఏడాది 10 లక్షల వీసాలు జారీ
Usa Visa
Follow us
Aravind B

|

Updated on: Sep 28, 2023 | 4:42 PM

భారత్‌లోని అమెరికా ఎంబసీ ఓ కొత్త రికార్డును సృష్టించింది. ప్రస్తుత సంవత్సరంలోని అన్ని రకాల కలిపి మిలియన్‌ వీసాలను జారీ చేయాలనే తమ లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ఈ ఏడాది ఇప్పటిదాక భారతీయులకు జారీ చేసిన వీసాల సంఖ్య 10లక్షలు దాటిపోయింది. ఈ విషయాన్ని అమెరికా రాయబార కార్యాలయం తన అధికారిక సామాజిక మాధ్యమం వేదికగా తెలిపింది. Missionto1M పూర్తయ్యిందని.. ఇండియాలో ఈ ఏడాది వీసాల ప్రక్రియలో మేం పెట్టుకున్న ‘మిలియన్‌ వీసాల జారీ’ లక్ష్యాన్ని దాటేశామని తెలిపింది. అయితే, ఇక్కడితోనే మేం ఆగిపోమని.. అలాగే రాబోయే నెలల్లో కూడా మరింత వృద్ధిని సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది. అంతేకాదు అమెరికాలో పర్యటన చేసేందుకు మరింత మంది ఇండియన్స్‌కు అవకాశం కల్పిస్తామని పేర్కొంది. ఈ మేరకు అమెరికా ఎంబసీ తమ పోస్ట్‌లో ఈ విధంగా రాసుకొచ్చింది. అంతేకాదు ఇందుకు సంబంధించిన దానికి కూడా ఓ వీడియోను జత చేసింది.

అయితే ఆ వీడియోలో భారత్‌కు అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి స్పందిస్తూ.. తమ దేశం సాధించిన ఈ రికార్డుపై ప్రశంసలు కురిపించారు. మా ద్వైపాక్షిక సంబంధాల్లో ముఖ్యమైనటువంటి దేశాల్లో ఇండియా ఒకటని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన బంధం తమదని పేర్కొన్నారు. అలాగే మా రెండు దేశాల మధ్య ఉన్నటువంటి భాగస్వామ్యం మరింత బలోపేతమైందంటూ వ్యాఖ్యానించారు. అయితే మా ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి బంధాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు రానున్న రోజుల్లో మరింత మంది భారతీయులకు ఇంకా రికార్డు స్థాయిలో వీసాలను అందజేస్తామని గార్సెట్టి వెల్లడించారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే 2022 ఏడాది మొత్తంలో చూసుకుంటే జారీ చేసినువంటి వీసాలను మించి.. ఈ సంవత్సరం ఇప్పటికే ఎక్కువగా వీసాలు జారీ అయినట్లు యూఎస్‌ ఎంబసీ పేర్కొంది. అలాగే 2019వ సంవత్సంరతో పోల్చి చూసినట్లైతే ఇది సుమారు 20 శాతం ఎక్కువగా ఉందని చెప్పింది. అయితే ప్రస్తుతం అమెరికా ప్రపంచవ్యాప్తంగా జారీ చేసినటువంటి వీసాల్లో 10 శాతం వీసాలు ఇండియాకే దక్కాయి. ఇక స్టూడెంట్ వీసాల్లో 20 శాతం ఉంది. అలాగే హెచ్‌, ఎల్ కేటగిరీ ఉద్యోగ వీసాల్లో చూసుకున్నట్లైతే ఏకంగా 65శాతం ఇండియాన్స్‌కే జారీ అయ్యాయి.

ఇవి కూడా చదవండి