AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Donation: గౌరవం ఇవ్వని కొడుకుకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన తండ్రి.. కోట్ల ఆస్తిని ఏం చేశాడంటే..

కొంత మందికి ఎంత ఆస్తి ఉన్నా ఇంకా కావాలని కోరుకుంటారు. కానీ కొందరు మాత్రం తమ కోట్ల ఆస్తిని త్రుణప్రాయంగా ఇచ్చేస్తున్నారు. ఒడిశాలోని ఒక మహిళ తన ఆస్తిని రిక్షా తొక్కేవాడికి ఇచ్చేసిన ఘటన మరవక ముందే యూపీలోని ఆగ్రాలో 83 ఏళ్ల వ్యక్తి తన రూ. 2.5 కోట్ల విలువైన స్థిరాస్తిని రాష్ట్రానికి ఇచ్చాడు...

Donation: గౌరవం ఇవ్వని కొడుకుకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన తండ్రి.. కోట్ల ఆస్తిని ఏం చేశాడంటే..
Property
Srinivas Chekkilla
|

Updated on: Nov 29, 2021 | 1:52 PM

Share

కొంత మందికి ఎంత ఆస్తి ఉన్నా ఇంకా కావాలని కోరుకుంటారు. కానీ కొందరు మాత్రం తమ కోట్ల ఆస్తిని త్రుణప్రాయంగా ఇచ్చేస్తున్నారు. ఒడిశాలోని ఒక మహిళ తన ఆస్తిని రిక్షా తొక్కేవాడికి ఇచ్చేసిన ఘటన మరవక ముందే యూపీలోని ఆగ్రాలో 83 ఏళ్ల వ్యక్తి తన రూ. 2.5 కోట్ల విలువైన స్థిరాస్తిని రాష్ట్రానికి ఇచ్చాడు. గణేష్ శంకర్ పాండే అనే వ్యక్తి, తన పెద్ద కొడుకు తనను ఇబ్బంది పెడుతున్నాడని, తన ఆస్తిని వారసత్వంగా పొందాలని కోరుకుంటున్నాడని చెప్పారు. పొగాకు వ్యాపారం చేసే పాండే తాను రాసిన వీలునామా కాపీని సిటీ మేజిస్ట్రేట్ ప్రతిపాల్ సింగ్‌కు కూడా అందజేశారు. ” పీపాల్ మండిలో నా 250 చదరపు గజాల ఇంటిని చాలా చర్చించిన తర్వాత జిల్లా మేజిస్ట్రేట్‌కు బదిలీ చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను” అని పాండే చెప్పారు.

“నా పెద్ద కొడుకు దిగ్విజయ్, అతని భార్య, ఇద్దరు పిల్లలు మా ఇంట్లో నివసిస్తున్నారు. దిగ్విజయ్ నిరంతరం ఆస్తిలో వాటా డిమాండ్ చేస్తున్నాడు. ఇది నాకు చాలా ఇబ్బంది కలిగించింది. నా కొడుకు నన్ను గౌరవించడు. తరచుగా నాతో అనుచితంగా ప్రవర్తించేవాడు. అక్కడ నేను అతనిని పట్టించుకోవడం సబబు కాదు. ఏళ్లుగా నేను అభివృద్ధి చేసిన వ్యాపారంపై దృష్టి పెట్టాలని అడిగాను, కానీ అతను నా ఆస్తిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే నేను బదిలీకి నా మనస్సును మార్చుకున్నాను. నా మరణానంతరం ప్రభుత్వం దానిని సక్రమంగా వినియోగించుకునేలా ఆస్తిని జిల్లా మేజిస్ట్రేట్‌కి పంపండి. నేను బతకడానికి నా దగ్గర తగినంత డబ్బు ఉంది” అని గణేష్ శంకర్ పాండే చెప్పాడు.

గణేష్ శంకర్ పాండే, అతని ముగ్గురు తమ్ముళ్లతో కలిసి 1983లో 1,000 చదరపు గజాల ఆస్తిని సంపాదించారు. నలుగురు సోదరులు ఆ ప్లాట్‌లో పెద్ద ఇంటిని నిర్మించారు. నలుగురు సోదరుల కుటుంబాలు ఒకే ఇంటిలో నివసిస్తున్నాయి. తర్వాత పరస్పర అవగాహనతో ఆస్తిని నాలుగు భాగాలుగా విభజించారు. సర్కిల్ రేటు ప్రకారం ఆస్తి అనేక కోట్ల రూపాయల విలువైనది, మొత్తం విషయాన్ని జిల్లా మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్తామని ప్రతిపాల్ సింగ్ చెప్పారు. “ఈ విషయం గణేష్ శంకర్ పాండేతో చర్చిస్తాము, అతను ఏదైనా ఇబ్బందిలో ఉంటే మేము అతనికి తగిన సహాయం చేస్తాము. ఒకవేళ, అతను అధికారికంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం” అని జిల్లా మేజిస్ట్రేట్ ప్రభు ఎన్ సింగ్ తెలిపారు.

Read Also.. Farm Laws Repeal bill: విపక్షాల ఆందోళన నడుమ వ్యవసాయ సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Omicron Variant: ఆందోళనకు గురి చేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్.. అసలు ఇది ప్రాణాంతకమా? కాదా?..