AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తీర్పు చెప్పే పెద్దలకే షాక్ ఇచ్చిన యువతి.. భర్తకు, ప్రియుడికి సమానంగా రోజులు పంచిన మహిళ

రోజు రోజుకీ మానవ సంబంధాలు దిగాజారిపోతున్నాయి. నైతిక విలువలకు త్రిలోదకాలు ఇచ్చేస్తూ.. వావి వరస అనే మాట లేకుండా అక్రమ సంబంధాన్ని నెరుపుతున్న స్త్రీలు, పురుషుల గురించి వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం.. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసిన కొంత మంది స్త్రీలు తమ ప్రేమికుడి కోసం కట్టుకున్న భర్తనే చంపేస్తున్నారు. అయితే తాజాగా ఒక యువతి.. భర్త, ప్రియుడికి సమానంగా తన ప్రేమని పంచుతానని ప్రకటించి సంచలనం సృష్టించింది. ఈ వింత కేసు ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

తీర్పు చెప్పే పెద్దలకే షాక్ ఇచ్చిన యువతి.. భర్తకు, ప్రియుడికి సమానంగా రోజులు పంచిన మహిళ
Unique Case
Surya Kala
|

Updated on: Aug 29, 2025 | 11:57 AM

Share

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఓ యువతి నిర్ణయం గ్రామస్తులను, స్థానిక పంచాయతీ సిబ్బందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. రాంపూర్ జిల్లాలో భార్యాభర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఎందుకంటే భార్య పదిసార్లు తన ప్రేమికుడితో పారిపోయింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. అయితే ఆ మహిళ ఒక ఆశ్చర్యకరమైన ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ప్రతి నెలా 15 రోజులు తన భర్తతో, మిగిలిన 15 రోజులు తన ప్రేమికుడితో గడపడానికి అనుమతించాలని గ్రామ పంచాయతీ పెద్దలను డిమాండ్ చేసింది.

ప్రత్యక్ష సాక్షుల అభిప్రాయం ప్రకారం.. ఈ ప్రతిపాదన చేసిన తర్వాత అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. అయితే భార్య చేసిన ప్రతిపాదన విన్న భర్త వణుకుతూ.. అక్కడ ఉన్న గ్రామస్తులతో “మీరు నన్ను ఒంటరిగా వదిలేయండి” అని చేతులు జోడించి మరీ వేడుకున్నాడు.

దంపతుల మధ్య పదే పదే గొడవలు జరుగుతున్నాయని.. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పరిష్కరించడానికి పంచాయతీ ఏర్పాటు చేశారు. అక్కడ పెద్దలు, గ్రామస్తుల ముందు ఆ మహిళ తన నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించింది, తన భర్త , తన ప్రేమికుడితో తన జీవితాన్ని సమానంగా పంచుకుంటానని పట్టుబట్టింది.

ఇవి కూడా చదవండి

ప్రతిస్పందనగా.. భర్త మళ్ళీ చేతులు జోడించి నమస్కరించి.. “నన్ను క్షమించు.. వెళ్లి నీ ప్రియుడితో ఉండు” అని అన్నాడు. అక్కడ ఉన్న వారందరూ భార్య చెప్పిన విషయం విన్న తర్వాత అక్కడ ఉన్నవారు దిగ్భ్రాంతికరమైన పరిస్థితికి చేరుకున్నారు.

ఈ వింత కేసు అజీమ్‌నగర్, తాండా పోలీస్ స్టేషన్ల పరిధిలోని రెండు గ్రామాలకు సంబంధించినది. సమాచారం ప్రకారం అజీమ్‌నగర్‌కు చెందిన ఒక యువతికి సుమారు ఒకటిన్నర సంవత్సరాల క్రితం పొరుగు గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది.

వివాహం అయిన తర్వాత ఆ యువతి తాండా ప్రాంతానికి చెందిన ఒక యువకుడితో ప్రేమలో పడి అతనితో పారిపోయింది. ప్రతిసారీ భర్త ఆమెను ఇంటికి తిరిగి తీసుకువచ్చాడు. అయితే ఆ మహిళ మళ్ళీ తన ప్రేమికుడితో పారిపోయేది. ఇలా ఎనిమిది సార్లు జరిగింది. ఇటీవల ఆమె మళ్ళీ తన ప్రేమికుడి ఇంటికి వెళ్ళింది. ఆమె భర్త ఆమెను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు.. ఆమె నిరాకరించడంతో కుటుంబ సభ్యులు పంచాయితీకి పిలుపునిచ్చారు.

విచారణ సమయంలో ఆమె అసాధారణ డిమాండ్ చేసి మొత్తం సమావేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇటువంటి ప్రతిపాదనను ఎలా అంగీకరిస్తామని గ్రామస్తులు ప్రశ్నించారు. అయితే ప్రస్తుతానికి పరిస్థితి ఇంకా పరిష్కారం కాలేదు. భర్త తనకు భార్యతో ఉండడం ఇష్టం లేదని స్పష్టంగా చెప్పాడు. అయితే.. ఆ మహిళ తనకు భర్త, ప్రియుడు ఇద్దరూ కావాలని.. ఇద్దరికీ సమయం కేటాయిస్తానని అనే ఆలోచనకు.. దృఢంగా కట్టుబడి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..