AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: పప్పులు ఆరోగ్యానికి మంచివే.. ఉబ్బరం, గ్యాస్ సమస్యలు రాకుండా ఏ పప్పును ఎంతసేపు నానబెట్టాలి?

ఆరోగ్యంగా ఉండాలంటే ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు కలిగిన సమతుల్య ఆహారం తీసుకోవాలి. పప్పుధాన్యాల్లో ప్రోటీన్, ఫైబర్, అనేక రకాల పోషకాలున్నాయి. దీనితో పాటు పప్పును తయారుచేసే పద్ధతి కూడా చాలా ముఖ్యం. వంట చేయడానికి ముందు పప్పును నీటిలో నానబెట్టడం ఎందుకు అవసరం? ఏ పప్పును ఎంతసేపు నానబెట్టాలి.. అనే విషయం గురించి తెలుసుకుందాం.

Kitchen Hacks:  పప్పులు ఆరోగ్యానికి మంచివే.. ఉబ్బరం, గ్యాస్ సమస్యలు రాకుండా ఏ పప్పును ఎంతసేపు నానబెట్టాలి?
Kitchen Hacks
Surya Kala
|

Updated on: Aug 29, 2025 | 8:36 AM

Share

భారతీయ ఆహారంలో కాయధాన్యాలు అంటే పప్పులు అత్యంత ముఖ్యమైన భాగం. ప్రోటీన్, అనేక రకాల పోషకాలకు మూలం. ప్రతి పప్పు దాని విభిన్న పోషకాలతో ప్రసిద్ధి చెందింది. కంది పప్పు, మసూర పప్పు, మినప పప్పు, శనగ పప్పు, పెసర పప్పు వంటి రాకలరకాల పప్పులను మనం రోజూ ఉపయోగిస్తాం. వీటిని తినడం వలన లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ప్రజలు పప్పుతో అన్నం, చపాతీలను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే చాలా మందికి పప్పు తిన్న తర్వాత కడుపు ఉబ్బరం, గ్యాస్, భారంగా అనిపిస్తుంది. దీనికి కారణం పప్పును వండడానికి ముందు నానబెట్టకపోవడం అయి ఉండవచ్చు.

అవును పప్పును వండే విధానం చాలా ముఖ్యం. ఎక్కువ మసాలా దినుసులు, నూనెతో తయారు చేస్తే.. పప్పు ఆరోగ్యానికి ప్రయోజనకరం ఇవ్వడానికి ఉండటానికి బదులుగా.. హాని కలిగిస్తుంది. అందుకనే పప్పును వండడానికి ముందు కొంత సమయం నానబెట్టాలని చెబుతూ పోషకాహార నిపుణురాలు లిమా మహాజన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. దీనిలో పప్పును వండడానికి ముందు ఎందుకు నానబెట్టాలి? ఏ పప్పును ఎంతసేపు నానబెట్టాలి అనే విషయం గురించి ఆమె వివరించారు. దీని గురించి తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

పప్పులను నానబెట్టడం ఎందుకు అవసరం? పోషకాహార నిపుణురాలు లిమా మహాజన్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. వంట చేయడానికి ముందు పప్పులను నీటిలో నానబెట్టడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అనే క్యాప్షన్‌ వీడియోకి జత చేశారు. పప్పులలో సహజంగా ఫైటిక్ యాసిడ్, టానిన్లు ఉంటాయని అవి ఐరెన్, జింక్, కాల్షియం శోషణను నిరోధిస్తాయని చెప్పారు. అటువంటి పరిస్థితిలో పప్పులను వండడానికి ముందు నానబెట్టడం వల్ల వీటిని తగ్గిస్తాయి. పప్పులలో ఒలిగోసాకరైడ్లు అనే చక్కెరలు ఉంటాయి.వీటిని మన కడుపు జీర్ణం చేసుకోదు. అప్పుడు గ్యాస్ సమస్య వస్తుంది. పప్పులను వండడానికి ముందు నానబెట్టినట్లయితే.. ఆ చక్కెరలు నీటిలో కలిసి పప్పుల నుంచి విడిపోతాయి. ఇలాగా చేయడం ద్వారా.. ఎంజైమ్‌లు చురుకుగా మారుతాయి. పప్పులను నానబెట్టిన తర్వాత మొలకెత్తే ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీని కారణంగా ప్రోటీన్, బి-విటమిన్లు, ఖనిజాలు మరింత జీవ లభ్యతను పొందుతాయి. అలాగే పప్పులను ముందుగా నీటిలో నానబెట్టడం ద్వారా.. అది త్వరగా తయారవుతుంది. అలాగే పోషకాలు కూడా చెక్కుచెదరకుండా ఉంటాయి. పప్పులు మృదువుగా మారుతాయి.

ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

ఏ పప్పు ధాన్యాలను ఎంతసేపు నానబెట్టాలంటే పొట్టు తీయని పెసర పప్పు, ఎర్ర కంది పప్పు, కంది పప్పులను వండడానికి ముందు 30 నిమిషాలు నీటిలో నానబెట్టాలి. పెసర పప్పు, మినప పప్పు, శనగ పప్పును 2 నుంచి 4 గంటలు నానబెట్టాలి. పెసరలు, మినుములను 6 నుంచి 8 గంటలు నానబెట్టాలి. రాజ్మా, అలసందలు వంటి వాటిని వండడానికి ముందు రాత్రి సమయంలో నీటిలో నానబెట్టాలి. దీనితో పాటు రాజ్మా, శనగలు, అలసందాలను వండేటప్పుడు, బే ఆకులు, యాలకులు,మిరియాలు జోడించండి.. ఈ మసాలా పదార్ధాలు వేయడం వలన జీర్ణక్రియకు సహాయపడతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)