AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India’s First 3D Printed Post Office: ఇండియాలోనే తొలి 3డి ప్రింటెడ్ పోస్టాఫీస్‌.. బెంగళూరులో ప్రారంభించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్..

India's First 3D Printed Post Office: కర్నాటకలోని బెంగళూరులో నిర్మించిన దేశంలోని తొలి 3డి - ప్రింటెడ్ పోస్టాఫీస్‌ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆగష్టు 18వ తేదీన అంటే శుక్రవారం నాడు ప్రారంభించారు. హాలాసూర్‌లోని కేంబ్రిడ్జ్ లే అవుట్‌లో ఈ పోస్టాఫీసును నిర్మించారు. ఎల్‌&టీ కంపెనీ 3డి కాంక్రీట్ ప్రింటింగ్‌ టెక్నాలజీని ఉపయోగించి ఈ నిర్మాణం చేపట్టింది. అధునాతన టెక్నాలజీతో 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న హలాసూర్ పోస్ట్‌ ఆఫీస్‌ను 45 రోజుల్లో పూర్తి చేశారు. ఇక పోస్ట్ ఆఫీస్ నిర్మాణ రూపకల్పనను ఐఐటి మద్రాస్ ఆమోదించింది. ఈ నిర్మాణానికి సంబంధించిన..

India's First 3D Printed Post Office: ఇండియాలోనే తొలి 3డి ప్రింటెడ్ పోస్టాఫీస్‌.. బెంగళూరులో ప్రారంభించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్..
India’s First 3d Printed Post Office
Shiva Prajapati
| Edited By: |

Updated on: Aug 18, 2023 | 11:33 AM

Share

కర్నాటకలోని బెంగళూరులో నిర్మించిన దేశంలోని తొలి 3డి – ప్రింటెడ్ పోస్టాఫీస్‌ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆగష్టు 18వ తేదీన అంటే శుక్రవారం నాడు ప్రారంభించారు. హాలాసూర్‌లోని కేంబ్రిడ్జ్ లే అవుట్‌లో ఈ పోస్టాఫీసును నిర్మించారు. ఎల్‌&టీ కంపెనీ 3డి కాంక్రీట్ ప్రింటింగ్‌ టెక్నాలజీని ఉపయోగించి ఈ నిర్మాణం చేపట్టింది. అధునాతన టెక్నాలజీతో 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న హలాసూర్ పోస్ట్‌ ఆఫీస్‌ను 45 రోజుల్లో పూర్తి చేశారు. ఇక పోస్ట్ ఆఫీస్ నిర్మాణ రూపకల్పనను ఐఐటి మద్రాస్ ఆమోదించింది. ఈ నిర్మాణానికి సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు.

అయితే, ఈ బిల్డింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి.. ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ చేపడుతున్న అభివృద్ధి పనులకు ఇది నిదర్శనం అన్నారు. బెంగళూరు దేశానికి ఎల్లప్పుడూ కొత్తదనాన్ని పరిచయం చేస్తుందని, ఇప్పుడు 3డి ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ భవనం పరంగా కొత్త టెక్నాలజీని అందించిందన్నారు. ఇది నేటి భారతదేశం స్ఫూర్తి అని, ఆ స్ఫూర్తితోనే దేశం పురోగమిస్తోందని పేర్కొన్నారు కేంద్ర మంత్రి.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎల్ అండ్ టి విడుదల చేసిన ఒక ప్రకటనలో.. L&T టెక్నాలజీని బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్ (BMTPC) ఆమోదించగా.. పోస్టాఫీస్ ఆర్కిటెక్చర్‌ను IIT మద్రాస్ ధృవీకరించింది. ‘పోస్టాఫీసు భవనం 3D ప్రింటింగ్ పూర్తి ఆటోమేటెడ్ 3D ప్రింటర్‌ను ఉపయోగించి, జాబ్ సైట్‌లో ‘ఓపెన్ టు స్కై’ వాతావరణంలో ‘ఇన్ సిట్’ వేయబడుతుంది’ అని పేర్కొంది.

L&T ప్రకారం.. 3D కాంక్రీట్ ప్రింటింగ్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయడం, నిర్మాణ నాణ్యతను మెరుగుపరచడం ద్వారా నిర్మాణ పద్ధతులను మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దాదాపు రెండేళ్ల క్రితం, త్వస్టా మాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ ద్వారా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ క్యాంపస్‌లో నిర్మించిన భారతదేశపు మొట్టమొదటి 3D-ప్రింటెడ్ హౌస్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో, భారతదేశంలో సరసమైన గృహాలను పెంచడానికి సాంకేతికతను ఉపయోగించాలని ఆమె సూచించారు. ముఖ్యంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద.. భారతీయ సైన్యం అహ్మదాబాద్ కాంట్ వద్ద సైనికుల కోసం ఎల్ అండ్ టి తన మొదటి రెండు-అంతస్తుల 3D-ప్రింటెడ్ నివాస యూనిట్‌ను కూడా ప్రారంభించింది.

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..