Vaccination‌ Process: వ్యాక్సినేషన్‌ ప్రక్రియ గురించి వివరాలు వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి

Vaccination‌ Process: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఈనెల 16 నుంచి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో...

Vaccination‌ Process: వ్యాక్సినేషన్‌ ప్రక్రియ గురించి వివరాలు వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి
Follow us

|

Updated on: Jan 12, 2021 | 7:07 PM

Vaccination‌ Process: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఈనెల 16 నుంచి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మొత్తం 110 లక్షల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులను తొలి దశ వ్యాక్సినేషన్‌లో అందించేందుకు గానూ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఈ 55 లక్షల డోసులలో 16.50 లక్షల డోసులను భారత్‌ బయోటెక్‌ ఉచితంగా సరఫరా చేస్తోందని, మిగిలిన 38.5 లక్షల డోసులకు గానూ ఒక్కో వ్యాక్సిన్‌ డోసుకు రూ.295ను కేంద్రం చెల్లిస్తోందని ఆయన వివరించారు. కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌లు రెండు అత్యవసర వినియోగంలో భాగంగా అందించనున్నారని తెలిపారు.

వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఎలాంటి ఆందోళన వద్దు

వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత చోటు చేసుకునే పరిణామాలపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నీతి అయోగ్‌ సభ్యులు డాక్టర్‌ వీకే పాల్‌ చెప్పారు. ట్రయల్స్‌లో భాగంగా వేల మందిపై ఈ రెండు వ్యాక్సిన్లను ప్రయోగించారని, వీటి వల్ల దుష్ప్రభావాలకు గురైన వారి సంఖ్య చాలా తక్కువ అని ఆయన చెప్పారు.

Serum Institute covishield Vaccine: తక్కువ ధరకే కోవిడ్‌ వ్యాక్సిన్‌.. సీరం ఇనిస్టిట్యూట్‌ కీలక నిర్ణయం