Union Cabinet: పోలవరం నిర్మాణంలో కీలక పరిణామం.. రూ.12,500 కోట్ల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పోలవరం నిర్మాణానికి నిధులకు ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 12 వేల 500 కోట్ల రూపాయలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ప్రాజెక్ట్ తొలి దశ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పోలవరం నిర్మాణానికి నిధులకు ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 12 వేల 500 కోట్ల రూపాయలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ప్రాజెక్ట్ తొలి దశ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది.
అలాగే, దేశంలో 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేయాలని కేబినెట్‌లో నిర్ణయించారు. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణ, బిహార్, పంజాబ్‌లోనూ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేయనున్నారు. 28 వేల 602 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నారు. తెలంగాణలోని జహీరాబాద్, ఏపీలోని ఓర్వకల్లు, కొప్పర్తి ప్రాంతాలను స్మార్ట్ సిటీస్ కోసం ఎంపిక చేసింది కేంద్రం.
2 వేల 621 ఎకరాల్లో 2, 786 కోట్ల రూపాయలతో ఓర్వకల్లు పారిశ్రామిక స్మార్ట్ సిటీలో మౌలిక వసతులు కల్పించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 45 వేల మందికి ఉపాధి లభించనుంది. మొత్తం 12 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. 2 వేల 137 కోట్ల రూపాయల వ్యయంతో కడపలోని కొప్పర్తిలో పారిశ్రామిక స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 2 వేల 596 ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 54 వేల మందికి ఉపాధి లభించనుంది. 3 వేల 245 ఎకరాల్లో తెలంగాణలోని జహీరాబాద్‌లో పారిశ్రామిక స్మార్ట్ సిటీ ఏర్పాటు చేయనున్నారు. 2 వేల 361 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. మొత్తం 10 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా లక్షా 74 వేల మందికి ఉపాధి లభించనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో పవర్‌లోకి రాగానే పోలవరంపై ఫుల్ ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వీలైంతన త్వరగా ప్రాజెక్టును కంప్లీట్ చేయడమే లక్ష్యంగా.. పనులను పరుగులు పెట్టిస్తున్నారు. లోకల్ ఇంజనీర్ల దగ్గర్నుంచి విదేశీ నిపుణుల సూచనలు సైతం తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. బాబు స్పీడుకి కేంద్రం తోడవ్వడంతో.. పనుల్లో మరింత వేగం పెరిగింది. ఇటీవల పోలవరంపై మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు… కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎక్స్‌పర్ట్స్ సలహాలు, సూచనలను కేబినెట్‌లో ప్రస్తావించారు. కేంద్రం నుంచి నిధులు ఎలా తీసుకురావాలన్న దానిపై చర్చించారు. వీటిని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర కేబినెట్ సమావేశంలో భారీగా నిధులు కేటాయిస్తూ ఎన్డీయే సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఇక నీతి ఆయోగ్ మీటింగ్‌లోనూ పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేకంగా ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. డయాఫ్రం వాల్ నిర్మాణ ప్రతిపాదనలు నీతి ఆయోగ్ ముందు పెట్టారు. ప్రాజెక్టుకు ప్రస్తుతం కావాల్సిన నిధులను అడగనున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలోనే మొన్నటి బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటామని స్పష్టం చేసింది కేంద్రం. ఆర్థిక సాయంతో పాటు బ్యాంకు గ్యారెంటీలకు భరోసా ఇచ్చింది. మున్ముందు మరింత సహాయ సహకారాలు అందిస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పనులను కేంద్రానికి వివరిస్తూ… విడతలవారీగా నిధులు తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగానే.. పోలవరానికి కావాల్సిన నిధుల కేటాయింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
మొత్తంగా… పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం… వీలైనంత తర్వగా ప్రాజెక్టును ఫినిష్ చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకెళ్తోంది. కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తూనే.. పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎలాంటి తప్పులు జరగకుండా ముందుకెళ్లాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..