Union Cabinet: భారత్‌పై తాలిబన్ల డబుల్ గేమ్.. తిప్పికొట్టే ప్లాన్‌లో కేంద్ర సర్కార్.. ఈ రోజు ఇదే చర్చ..
ఆఫ్గన్ తాలిబన్ల డబుల్ గేమ్ భారత్‌కు అర్ధమయ్యింది. తాజా పరిస్థితిపై సమీక్షించిన ప్రధాని మోదీ భారతీయుల తరలింపు వేగవంతం చేయాలని కోరారు. తాలిబన్లతో జతకట్టిన కశ్మీర్ ఉగ్రవాదుల విషయంలో చాలా అప్రమత్తంగా...

ఆఫ్గన్ తాలిబన్ల డబుల్ గేమ్ భారత్‌కు అర్ధమయ్యింది. తాజా పరిస్థితిపై సమీక్షించిన ప్రధాని మోదీ భారతీయుల తరలింపు వేగవంతం చేయాలని కోరారు. తాలిబన్లతో జతకట్టిన కశ్మీర్ ఉగ్రవాదుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించారు. ఆఫ్గన్‌లో తాజా పరిణామాలు భారత్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆఫ్గన్‌లో తాజా పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భద్రతా వ్యవహరాల కమిటీ అత్యవసరంగా భేటీ అయ్యింది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్‌సింగ్,హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ , ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆఫ్గన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపును మరింత వేగవంతం చేయాలని ప్రధాన మోదీ సూచించారు.
At the meeting of the Cabinet Committee on Security today, PM Modi instructed all officials concerned to undertake all necessary measures to ensure safe evacuation of Indian nationals from Afghanistan in the coming days pic.twitter.com/QmfejDoJEo
— ANI (@ANI) August 17, 2021
భారత్‌కు రావడానికి మొత్తం 1650 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎయిర్‌ఫోర్స్ సీ-17 గ్లోబల్ మాస్టర్ విమానంలో ఇప్పటివరకు 250 మందిని భారత్‌కు తరలించారు. ఆఫ్గనిస్తాన్ నుంచి భారత దౌత్య సిబ్బంది తరలింపు పూర్తయినట్టు విదేశాంగశాఖ ప్రకటించింది. గుజరాత్ లోని జామ్‌నగర్‌తో పాటు యూపీ లోని హిండాన్ ఎయిర్‌బేస్‌లో ఈ విమానాలు ల్యాండయ్యాయి.
అయితే తాలిబన్ల గుప్పిట్లో ఉన్న ఆఫ్గన్ నుంచి భారతీయుల తరలింపు పెద్ద తలనొప్పిగా మారింది. కొద్దిమంది మాత్రమే భారత్‌కు రావడానికి వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా చాలామంది అక్కడే చిక్కుకుపోయారు. వాళ్లందరిని తప్పకుండా స్వదేశానికి తీసుకొస్తామని ఆఫ్గన్‌లో భారత రాయబారి రుదేంద్ర టాండన్ తెలిపారు.
కాబూల్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు దేశమంతా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని స్వదేశానికి చేరుకున్న భారతీయులు తెలిపారు. ఆఫ్గన్ పౌరులు కూడా ప్రస్తుత పరిస్థితులను చూసి ఆందోళన చెందవద్దని, భారత్ వాళ్లకు తప్పకుండా అండగా ఉంటుందని రుదేంద్ర టాండన్ వెల్లడించారు.
మరోవైపు తాలిబన్ల భయంతో అల్లాడిపోతున్న ఆఫ్గనిస్తాన్ పౌరులకు ఎమర్జెన్సీ వీసాలు ఇవ్వడానికి కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎమర్జెన్సీ ఎలక్ట్రిక్ వీసాలు మంజూరు చేస్తామని కేంద్ర హోంశాఖ తెలిపింది. మరోవైపు భారత్‌తో డబుల్‌గేమ్ ఆడుతున్నారు తాలిబన్లు. కశ్మీర్ భారత అంతర్గత వ్యవహారమని తాజాగా స్టేట్‌మెంట్ విడుదల చేశారు.
కాని కాబూల్‌లో మాత్రం వాళ్లకు కశ్మీర్ ఉగ్రవాదులు పూర్తిగా అండగా ఉన్నారు. కాబూల్‌లో తాలిబన్ల తరపున సెక్యూరిటీ విధుల్లో లష్కర్ ఏ తాయిబా ఉగ్రవాదులతో పాటు లష్కర్ ఏ జంగ్వీ ఉగ్రవాదులు ఉన్నారు. అంతేకాదు అమెరికా సైనికులు వదిలివెళ్లిన 3 లక్షల ఆయుధాలను లూటీ చేసి తాలిబన్లకు అందించారు.
తాలిబన్ల కోసం లష్కర్‌తో పాటు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలు ఫండ్స్‌ను వసూలు చేసినట్టు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. పాక్ ఐఎస్‌ఐ సాయంతో కశ్మీర్ ఉగ్రవాదులు ఆఫ్గన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో కశ్మీర్‌పై భారత్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈనెల 20వ తేదీన ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. దోహా నుంచి ఆఫ్గనిస్తాన్ చేరుకుంటోంది తాలిబన్ హైకమాండ్. దేశ పౌరులకు క్షమాభిక్ష ప్రసాదిస్తునట్టు తాలిబన్లు కీలక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరాలని కోరారు. మహిళలు కూడా ఉద్యోగాల్లో చేరవచ్చని కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే తాలిబన్ల మాటలు ఆఫ్గన్ మహిళలు నమ్మడం లేదు.. చీకటిరోజులను వాళ్లు మర్చిపోలేకపోతున్నారు. మీ అటవిక పాలన అక్కర్లేదని కాబూల్ వీధుల్లో తాలిబన్ల ముందే నిరసనకు దిగారు ఆఫ్గన్ మహిళలు. ప్రాణాలు పోయినా సరే స్వేచ్చ కావాలని ప్లకార్డులు ప్రదర్శించారు.
ఇవి కూడా చదవండి: Postal Life Insurance: తక్కువ పెట్టబడితో ఎక్కువ భద్రత.. పోస్టాఫీసులో అదిరిపోయే ఇన్సూరెన్స్ ప్లాన్..