Union Budget: బడ్జెట్ ప్రసంగంలోనూ రికార్డులే.. ఎవరి పేరు మీద ఉన్నాయో తెలుసా..? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ కోసం..

వచ్చే ఏడాది ప్రారంభంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో

Union Budget: బడ్జెట్ ప్రసంగంలోనూ రికార్డులే.. ఎవరి పేరు మీద ఉన్నాయో తెలుసా..? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ కోసం..
Union Budget
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 01, 2023 | 7:44 PM

కొత్త ఆకాంక్షలు.. కోటి ఆశల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2023-24 సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఐదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడటంతో అందరి దృష్టి ఆమెపైనే ఉంది. వచ్చే ఏడాది ప్రారంభంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో అధిక సమయం సుధీర్ఘంగా ప్రసంగించిన ఘనత నిర్మలమ్మకే ఉంది. ఇప్పటి వరకు రెండు గంటల 42 నిమిషాల పాటు సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం చేసిన ఘనత నిర్మలమ్మకే దక్కింది.

బడ్జెట్ గురించి ఆసక్తికరమైన విషయాలు..

భారతదేశంలో స్వాతంత్ర్యానికి పూర్వం 1860 ఏప్రిల్ 7న ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటీష్ క్రౌన్‌కు జేమ్స్ విల్సన్ బడ్జెట్‌ను మొదటిసారిగా ప్రవేశపెట్టారు. భారతదేశానికి స్వాతంత్ర్యం అనంతరం 1947 నవంబర్ 26న అప్పటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం మొదటిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

2 గంటల 42 నిమిషాలు..

అయితే, బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో సుధీర్ఘంగా అత్యధిక సమయం ప్రసంగించిన రికార్డు నిర్మలా సీతారామన్ పేరునే ఉంది. 1 ఫిబ్రవరి 2020న కేంద్ర బడ్జెట్ 2020-21ను సమర్పిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. 2 గంటల 42 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేసి అరుదైన ఘనత సాధించారు. ఇంకా రెండు పేజీలు మిగిలి ఉండగా.. ఆమె అనారోగ్యంగా భావించడంతో ఆమె తన ప్రసంగాన్ని తగ్గించాల్సి వచ్చింది. ప్రసంగంలో మిగిలిన భాగాన్ని చదివినట్లుగా పరిగణించాలని ఆమె స్పీకర్‌ను కోరారు. ఈ ప్రసంగం సమయంలో ఆమె తన రికార్డును తానే బద్దలు కొట్టారు. జూలై 2019లో నిర్మలమ్మ తన తొలి ప్రసంగంలో 2 గంటల 17 నిమిషాల పాటు ప్రసంగించి అందరి ప్రశంసలు పొందారు.

ఇవి కూడా చదవండి

18,650 పదాలు..

బడ్జెట్‌లో పదాల పరంగా చూస్తే.. 1991లో నరసింహారావు ప్రభుత్వ హయాంలో సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగంలో మన్మోహన్ సింగ్ 18,650 పదాలను ప్రసంగాన్ని ముగించారు. పదాల పరంగా ఆయనే మొదటి స్థానంలో ఉన్నారు. 2018లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగం పదాల గణనలో రెండవ స్థానంలో ఉంది. ఇందులో 18,604 పదాలు ఉండగా జైట్లీ గంటా 49 నిమిషాల పాటు ప్రసంగించారు.

800 పదాలు..

పదాల పరంగా 1977లో మాజీ ఆర్థిక మంత్రి హిరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ చేసిన బడ్జెట్ ప్రసంగం చిట్టచివరిన భాగాన ఉంది.

షాయరీలు, కవితలు..

అయితే, బడ్జెట్ ప్రసంగాన్ని ఆసక్తికరంగా మార్చేందుకు, అలాగే ఉత్కంఠతను తెలియపర్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రులు షాయరీలను, కవితలను కూడా ఉపయోగించేవారు.

రికార్డు స్థాయిలో బడ్జెట్‌లను ప్రవేశపెట్టింది.. ఆయనే..

దేశ చరిత్రలో అత్యధిక బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన రికార్డు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌దే. అతను 1962-69లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన సమయంలో 10 బడ్జెట్‌లను సమర్పించారు. ఆ తర్వాత పి చిదంబరం (9), ప్రణబ్ ముఖర్జీ (8), యశ్వంత్ సిన్హా (8), మన్మోహన్ సింగ్ (6) ఉన్నారు. నిర్మలా సీతారామన్ మహిళా మంత్రి 5 సార్లు బడ్జెట్ లను ప్రవేశపెట్టారు.

సమయం..

1999 వరకు ఫిబ్రవరి చివరి రోజున సాయంత్రం 5 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను ప్రకటించేవారు. ఇది బ్రిటిష్ కాలం నుంచి వారసత్వంగా వచ్చిన పద్ధతి. మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా 1999 కేంద్ర బడ్జెట్‌ను ఉదయం 11 గంటలకు ప్రకటించడం ద్వారా బడ్జెట్ సమర్పణ ఆచారాన్ని మార్చారు.

ఒకరోజు ముందే..

1950లో బడ్జెట్ పత్రాలను రాష్ట్రపతి భవన్‌లో ముద్రించారు. మరుసటి సంవత్సరం, ప్రింటింగ్‌ను మింటో రోడ్‌లోని ప్రెస్‌కు మార్చారు, ఆపై నార్త్ బ్లాక్‌లోని బేస్‌మెంట్‌కు ముద్రణను మార్చారు. ఇది బడ్జెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రెస్‌కు శాశ్వత వేదికగా మారింది.

భాష..

1955 వరకు కేంద్ర బడ్జెట్ ఆంగ్లంలో మాత్రమే సమర్పించేవారు. అయితే, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం తరువాత హిందీ, ఇంగ్లీషు రెండింటిలోనూ బడ్జెట్ పత్రాలను ముద్రించాలని నిర్ణయించింది.

పేపర్‌లెస్ బడ్జెట్..

స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారిగా 2021-22 బడ్జెట్‌ను పేపర్‌లెస్‌గా మారుస్తూ నరేంద్రమోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న COVID-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ను పేపర్‌లెస్‌గా మార్చారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..