Uma Bharti: వాళ్లున్నది మా చెప్పులు తీసేందుకే.. ఫైర్‌బ్రాండ్‌ ఉమా భారతి సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్

Uma Bharti's controversial remark: బీజేపీ సీనియర్ నాయకురాలు, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఫైర్‌బ్రాండ్‌ ఎంపీ ఉమా భారతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అధికారులు

Uma Bharti: వాళ్లున్నది మా చెప్పులు తీసేందుకే.. ఫైర్‌బ్రాండ్‌ ఉమా భారతి సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్
Uma Bharti
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 21, 2021 | 7:03 AM

Uma Bharti’s controversial remark: బీజేపీ సీనియర్ నాయకురాలు, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఫైర్‌బ్రాండ్‌ ఎంపీ ఉమా భారతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అధికారులు ఉన్నది తమ చెప్పులు తీసేందుకేనంటూ ఎంపీ ఉమా భారతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్యూరోక్రసీ లాంటిదేమీ లేదు. బ్యూరోక్రసీ చెప్పులు తీయడానికి ఉంది. అధికారులు మా చెప్పులను తీసుకుంటారు. మేము దానిని మాత్రమే అనుమతిస్తాము.. అంటూ ఆమె మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం భోపాల్‌ ఎంపీ ఉమా భారతిని కొందరు ఓబీసీ నాయకులు శనివారం భోపాల్‌లోని ఆమె నివాసంలో కలిశారు. కుల ఆధారిత జనాభా గణన, ప్రైవేట్ ఉద్యోగాలలో ఓబీసీ కోటా గురించి వారు మాట్లాడారు. ఈ విషయంపై ఎంపీలోని బీజేపీ ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోకపోతే నిరసన చేస్తామంటూ ఓబీసీ నాయకులు స్పష్టంచేశారు.

ఈ సందర్భంగా ఉమా భారతి వారితో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బ్యూరోక్రాట్లు రాజకీయ నాయకులను నియంత్రిస్తారని మీరు అనుకుంటున్నారా.. అలాంటిదేమీ లేదు. మొదట ప్రైవేట్‌గా చర్చలు జరుగుతాయి. ఆపై బ్యూరోక్రసీ ఒక ఫైల్‌ను సిద్ధం చేస్తుంది. నన్ను అడగండి.. 11 ఏళ్లు నేను కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నాను. ముందుగా మేము చర్చించిన తర్వాతే ఫైల్ ప్రాసెస్ అవుతుంది. రాజకీయ నాయకులను బ్యూరోక్రసీ నియంత్రిస్తుందన్నది ఒట్టి మాటే. వారేం చేయలేరు. వారు దేనికి ఉన్నారు.. అంటే.. మా చెప్పులు తీయడానికి.. మేము వారికి జీతం, పోస్టింగ్‌లు, ప్రమోషన్లు ఇస్తున్నాం. ఇక వారేం చేయగలరు? నిజం ఏమిటంటే మేము వారిని రాజకీయాల కోసం మాత్రమే ఉపయోగిస్తాం’.. అంటూ ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు.

వీడియో.. 

ఇదిలాఉంటే.. ఉమాభారతి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ బ్యూరోక్రాట్లు నిజంగానే రాజకీయ నేతల చెప్పులు మోస్తారా అన్నదానిపై సీఎం శివరాజ్ సింగ్‌ చౌహన్‌ స్పష్టత ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేత కేకే మిశ్రా డిమాండ్‌ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఉమాభారతి క్లారిటీ ఇచ్చారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఉమా భారతి పేర్కొన్నారు. బ్యూరోక్రసీకి రక్షణగానే తాను మాట్లాడినట్లు ట్వీట్‌ చేశారు. ఇక నుంచి ఇలా మాట్లాడని.. ఎదైనా తప్పుంటే క్షమించాలి అంటూ పేర్కొన్నారు.

Also Read:

Goa Polls 2022: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ప్రచారాస్త్రం అదే.. తేల్చేసిన కేజ్రీవాల్

Congress Party: సీఎం అభ్యర్ధి ఎవరన్న విషయంపై కాంగ్రెస్‌ క్లారిటీ.. ఆ ఇద్దరి నేతృత్వంలోనే పోటీకి సై..