Encounter in J&K: జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఇండియన్ ఆర్మీ..
జమ్మూకశ్మీర్‌లోని సోఫియాన్‌లో గల కనిగం ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇండియన్ ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు..
Encounter in J&K: జమ్మూకశ్మీర్‌లోని సోఫియాన్‌లో గల కనిగం ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇండియన్ ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఈ ఆపరేషన్‌లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. హతమైన వీరిద్దరూ జమ్మూ కశ్మీర్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ అధికారులు అధికారికంగా వెల్లడించారు. దీనికి ముందు ఇద్దరు టెర్రరిస్టులు కనిగం ప్రాంతంలో ఆశ్రయం పొందినట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దాంతో ఇండియన్ ఆర్మీ, స్థానికుల పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు. ఉగ్రమూకలను మట్టుబెట్టారు. అయితే టెర్రరిస్టులు, భద్రతా బలగాలకు జరిగిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయాలపాలైనట్లు ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. వారికి ఆస్పత్రిలో చికిత్స అందుతుందని, వారు క్షేమంగానే ఉన్నట్లు చెప్పారు.
Also read:
Supreme Court: సుప్రీంకోర్టునే ఏమార్చాడు.. ఎట్టకేలకు అడ్డంగా బుక్కయ్యాడు.. అసలేం జరిగిందంటే..