Viral: సగం షేవింగ్ చేసి డబ్బులు అడిగాడు.. తర్వాత ఇస్తానంటే గొంతు కోసేశాడు.. చివరికి ఏం జరిగిందంటే..
షేవింగ్ విషయంలో తలెత్తిన గొడవ రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. రెండు కుటుంబాలను రోడ్డున పడేసింది. గ్రామంలో టెన్షన్ వాతావరణానికి కారణమైంది. కస్టమర్ కు, బార్బర్ కు మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు..
షేవింగ్ విషయంలో తలెత్తిన గొడవ రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. రెండు కుటుంబాలను రోడ్డున పడేసింది. గ్రామంలో టెన్షన్ వాతావరణానికి కారణమైంది. కస్టమర్ కు, బార్బర్ కు మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గడ్డం తీస్తుండగా యజమాని డబ్బు ఇవ్వాలంటే తర్వాత ఇస్తానని కస్టమర్ చెప్పాడు. అతని ఆన్సర్ బార్బర్ కు నచ్చలేదు. ఇప్పుడే డబ్బులు ఇవ్వాలని గొడవ చేశాడు. మాటామాటా పెరిగి పదునైన కత్తితో కస్టమర్ గొంతు కోసేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు బార్బర్ పై దాడి చేసి కొట్టి చంపేశారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోధి గ్రామంలో అనిల్ మారుతి శిండే సెలూన్ షాప్ నిర్వహిస్తున్నాడు. కటింగ్, షేవింగ్ కోసం వచ్చే వారికి కాదనకుండా పని చేసిపెట్టడం అతని బాధ్యత. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన వెంకట్ సురేశ్ షేవింగ్చేయించుకునేందుకు వెళ్లాడు. పని సగం అయ్యాక అనిల్ డబ్బులు ఇవ్వాలని అడిగాడు. దాంతో వెంకట్ షేవింగ్ పూర్తిగా చేస్తానని చెప్పాడు. దీనికి అనిల్ ఒప్పుకోలేదు. డబ్బులు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి, తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న అనిల్.. దుకాణంలో ఉన్న పదునైన ఆయుధంతో వెంకట్ గొంతు కోసేశాడు. తీవ్ర రక్తస్రావమై వెంకట్ అక్కడికక్కడే మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న వెంకట్ బంధువులు సెలూన్ షాప్‌పై దండెత్తారు. దుకాణాన్ని తగలబెట్టారు. అనిల్‌ను వెతికి పట్టుకున్నారు. విచక్షణారహితంగా దారుణంగా కొట్టారు. అనంతరం గ్రామంలోని అతని ఇంటికి తగలబెట్టారు. ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన అనిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి బోధి గ్రామానికి చేరుకున్నారు. ఘటనకు పాల్పడిన వారిలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్నారు. సమగ్ర దర్యాప్తు చేపట్టారు. నిందితులను వదిలి పెట్టేది లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి