WITT Summit 2024: రాహుల్ గాంధీని సీరియస్‌గా తీసుకోరు.. టీవీ9 సమ్మిట్‌లో ధర్మేంద్ర ప్రధాన్ సంచలన వ్యాఖ్యలు..
దేశ రాజధాని ఢిల్లీలో టీవీ9 నెట్‌వర్క్ వాట్ ఇండియా థింక్స్ టుడే సత్తా సమ్మేళన్ మూడోరోజు కొనసాగుతోంది. పలు పార్టీలకు చెందని రాజకీయ ప్రముఖులు హాజరై.. పలు అంశాలపై మాట్లాడుతున్నారు. టీవీ9 WITT సత్తా సమ్మేళనంలో మంగళవారం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా పాల్గొని ప్రసంగించారు.
దేశ రాజధాని ఢిల్లీలో టీవీ9 నెట్‌వర్క్ వాట్ ఇండియా థింక్స్ టుడే సత్తా సమ్మేళన్ మూడోరోజు కొనసాగుతోంది. పలు పార్టీలకు చెందని రాజకీయ ప్రముఖులు హాజరై.. పలు అంశాలపై మాట్లాడుతున్నారు. టీవీ9 WITT సత్తా సమ్మేళనంలో మంగళవారం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా పాల్గొని ప్రసంగించారు. ‘మోదీ ఉంటే గ్యారెంటీ!’ సెషన్‌లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మోదీ.. ప్రభుత్వ విజయాల గురించి మాట్లాడారు. అంతేకాకుండా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ వారు రాహుల్ గాంధీని సీరియస్‌గా తీసుకోరని, అందుకే ఆయనపై నేను వ్యాఖ్యానించబోనంటూ తెలిపారు. అయితే తమ ప్రభుత్వం రైతులకు అనేక సౌకర్యాలు కల్పించిందని, ఆర్థిక సహాయంతో పాటు వారి ధాన్యాన్ని ఎంఎస్‌పికి కొనుగోలు చేస్తున్నామని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. మోదీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రశ్నలతో పాటు రైతులకు ఎంఎస్‌పికి చట్టబద్ధమైన హామీ ఇస్తానని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హామీపై స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్.. రైతుల కోసం మోదీ ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. నేరుగా రైతుల ఖాతాలకు డబ్బులు పంపుతున్నామంటూ వివరించారు.
ఎంఎస్‌పికి చట్టపరమైన హామీ ఇస్తానని రాహుల్ గాంధీ చేసిన వాగ్దానాన్ని దేశంలో ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. చెప్పేదేముంది, ఎవరైనా పిచ్చి మాటలు మాట్లాడవచ్చు.. ఇదీ పరిస్థితి, ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి మరింత దారుణంగా మారనుంది. గత ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ నిధికి అందించిన సొమ్ము చిన్నదేమీ కాదు.. అంటూ వెల్లడించారు.
రైతులు అనేక రకాల ప్రయోజనాలు పొందుతున్నారని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. నేడు రైతులే కాకుండా పాల ఉత్పత్తిదారులు, పశువుల పెంపకందారులు, మత్స్యకారులు కూడా కిసాన్ క్రెడిట్ కార్డు ప్రయోజనాలను పొందుతున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రధాని మోదీని సహించలేని వ్యక్తులు ఇలాంటి నిరాధారమైన మాటలు మాట్లాడుతున్నారు. అయితే ఎన్నో దశాబ్దాలుగా అధికారంలో ఉండి ఎంఎస్పీకి చట్టపరమైన హామీ ఎందుకు ఇవ్వలేదంటూ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు.
రిజర్వేషన్ పరిమితిని తొలగిస్తామన్న హామీపై ఫైర్..
అదే సమయంలో, 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని రద్దు చేస్తానని చెప్పిన రాహుల్ గాంధీ హామీపై కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ఇది కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాల్లో జరిగిందా లేదా..? అంటూ ప్రశ్నించారు. ఇటీవల ఉన్న రాష్ట్రాల్లో ఇది జరగలేదని వివరించారు. బీపీ సింగ్ హయాంలో మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేసినప్పుడు రాజీవ్ గాంధీ ఏం చెప్పారో రాహుల్ గాంధీకే తెలియాలి. ఈ రోజుల్లో ప్రజలు వాటిని అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు.. అంటూ పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..