ఏఐతో సినిమాకు కొత్త భవిష్యత్తు..! AI² 2026 అవార్డ్స్‌ను ప్రారంభించిన టీవీ9 నెట్‌వర్క్స్
టీవీ9 నెట్‌వర్క్ 'AI² 2026 అవార్డ్స్'ను ప్రారంభించింది, ఇది సినిమా నిర్మాణంలో కృత్రిమ మేధస్సు (AI) కళాత్మక ఊహల వినూత్న కలయికను ప్రోత్సహిస్తుంది.ఈ అవార్డులు కథలు చెప్పే విధానాన్ని పునర్నిర్వచించడానికి AI సాధనాలను సృజనాత్మకంగా ఉపయోగించేవారిని గుర్తిస్తాయి.ఈ పోటీలో అవార్డు గెలుచుకున్న చిత్రాలను 2026లో న్యూఢిల్లీలో జరగబోయే ‘WITT న్యూస్9 గ్లోబల్ సమ్మిట్’లో ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు.

టీవీ9 నెట్‌వర్క్ చూపే ఈ సరికొత్త చోరవతో కథలు చెప్పడం అనేది కొత్త యుగంలోకి అడుగుపెడుతోంది. స్క్రిప్టింగ్, సౌండ్ డిజైన్ నుండి విజువల్స్, కథనం వరకు.. కృత్రిమ మేధస్సు (AI) సృజనాత్మక ప్రక్రియను పూర్తిగా మార్చేస్తోంది. ఇది కళాకారుడిని స్థానాన్ని భర్తీ చేయడం కాదు , వారి ఊహకు అపార శక్తిని, రెక్కలను ఇస్తోంది. సాంకేతికతతో పాటు భావోద్వేగాల సమ్మేళనం జరుగుతున్న ఈ యుగంలో AI² అవార్డులు 2026ను TV9 నెట్‌వర్క్ గర్వంగా ప్రకటిస్తోంది. ఈ అద్భుతమైన, అరుదైన చొరవ చలనచిత్ర నిర్మాణ ప్రపంచంలో కృత్రిమ మేధస్సు , కళాత్మక ఊహల అద్భుత సంగమాన్ని ఘనంగా జరుపుకుంటూ మరింత కొత్త అవకాశాలను తెరుస్తోంది. AI² 2026 అవార్డుల తర్వాత కథలు కేవలం చెప్పడం కాదు.. సృష్టించబడతాయి.
AI² అవార్డులు విద్యార్థులు,స్వతంత్ర కళాకారులు, కొత్త నిపుణులు, ప్రయోగాత్మక చిత్రనిర్మాతలు కొత్త దృశ్య కథలను నిర్మించడానికి కృషిచేస్తాయి. ఈ అవార్డులు కొత్త సృష్టికర్తల ప్రోత్సహించడం, డాక్యుమెంటరీలు, మ్యూజిక్ వీడియోలు, యానిమేషన్ లేదా బ్రాండెడ్ కంటెంట్ ఏదైనా కథ చెప్పే విధానాన్ని మార్చడం లక్ష్యంగా పెట్టుకొని అందించబడుతున్నాయి.దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. AI సహాయంతో, ఎవరైనా ఇప్పుడు తమ కథను ప్రపంచానికి చూపించవచ్చు. డిజిటల్ ఎడిటింగ్ చలనచిత్ర పరిశ్రమను మార్చినట్లే,AI కథ చెప్పడాన్ని ప్రదర్శనగా మారుస్తోంది.
ఈ అవార్డుకోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
AI² అవార్డ్స్ 2026 కోసం రిజిస్ట్రేషన్ డిసెంబర్ 8, 2025న ప్రారంభమై జనవరి 31, 2026 వరకు కొనసాగుతుంది. ప్రతి సినిమాను అనుభవజ్ఞులైన చిత్రనిర్మాతలు, సాంకేతిక నిపుణులు, సృజనాత్మక వ్యక్తులతో కూడిన జ్యూరీ నిర్ణయిస్తుంది. జ్యూరీ రౌండ్ ఫిబ్రవరి 2026లో ముంబైలో జరుగుతుంది.
WITT-News9 గ్లోబల్ సమ్మిట్ 2026
మార్చి 2026లో జరిగే WITT-News9 గ్లోబల్ సమ్మిట్ 2026 (న్యూఢిల్లీ)లో ఈ అవార్డ్స్ విజేతలను ప్రకటిస్తారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన చిత్రాలను మీడియా ఆవిష్కరణ నాయకుల ముందు ప్రదర్శించడంతోపాటు, AI,సృజనాత్మకత భవిష్యత్తుపై ప్రత్యేక ప్యానెల్ చర్చ కూడా జరుగుతుంది. కళ, అల్గోరిథంల ఈ వివాహం, AI² అవార్డ్స్ 2026, సినిమా భాషను పునర్నిర్వచించాలని కోరుకునే వారందరికీ బహిరంగ ఆహ్వానాన్ని అందిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




