Indigo Crisis: వ్యవస్థను శాసిస్తున్న ఒకే ఒక సంస్థ.. ఇండిగో రెక్కలు విరిచేదెలా..?
సెల్‌ఫోన్లు వచ్చిన కొత్తలో కాల్ చేసినా, కాల్ ఎత్తినా ఛార్జీల మోత మోగేది. ఎప్పుడైతే కొత్త లైసెన్సులు ఇచ్చారో.. సెకన్‌కు పైసానే అన్నాయి. ఆ తరువాత అర పైసానే వసూలు చేశాయి. ఎప్పుడైనా సరే.. పోటీ ఉంటేనే రేట్లు తగ్గుతాయి. మరిన్ని నాణ్యమైన సేవలు అందుతాయి. మరి ఎయిర్‌లైన్స్ విషయంలో ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు. మధ్యతరగతికి ఆదాయం పెరిగినా సరే.. ఇప్పటికీ విమానాన్ని నీలాకాశంలోనే చూస్తున్నాడు తప్ప ఎక్కేంత ధైర్యం చేయడం లేదు. ఎందుకని? మొనోపోలి.. ఏకఛత్రాధిపత్యమే దీనికి కారణమా..?

విమానాలను హైజాక్ చేయడం చాలా సందర్భాల్లో చూశాం. ప్రయాణికులే హైజాకర్ల బలం, ఆయుధం. జనరల్‌గా ఇలాంటివి టెర్రరిస్టులు చేసే పని. మరి.. అదే ప్రయాణికులను కొన్ని గంటల పాటు ఎయిర్‌పోర్టుల్లోనే బందించేసినంత పని చేసింది ఇండిగో. దీనికేం పేరు పెట్టాలి? ప్రయాణికుల సేఫ్టీనే ముఖ్యమని హైజాకర్ల డిమాండ్లకు ఒప్పుకుంటాయి ప్రభుత్వాలు. సరిగ్గా అలాగే జరిగలేదా ఇండిగో విషయంలో కూడా. కొన్నిగంటల్లోనే దిగొచ్చి.. ‘సరే మీరు కోరినట్టే రూల్స్‌ను పక్కనపెడుతున్నాం’ అని ప్రకటించింది DGCA. ఒకట్రెండు కాదు, వందలు వేలు కాదు.. ఏకంగా 3 లక్షల మంది ప్రయాణాలను చిందరవందర చేసింది. పరోక్షంగా కొన్ని లక్షల మందిపై ప్రభావం చూపింది. ఇండిగో సంక్షోభం.. యావత్ దేశానికి ఇచ్చిన ఒక సందేశం. ఏ రంగంలోనైనా సరే.. ఏకఛత్రాధిపత్యం ఎంత ప్రమాదకరమో చెప్పిన సంఘటన ఇది. ప్రస్తుతానికి ఇండిగో సంక్షోభం ముగుస్తున్నట్టే లెక్క. కాని, ఏ లెక్కన ఈ సంక్షోభం ముగిసిందో గుర్తుంచుకోవాలి. రెగ్యులేటరీ మెడలు వంచి, వ్యవస్థ మొత్తాన్ని శాసించి.. అప్పుడు పరిస్థితిని చక్కదిద్దుకుంది. మరి దీన్నుంచి కేంద్రం గానీ, DGCA గానీ నేర్చుకున్న పాఠం ఏంటి? ఎయిర్‌లైన్స్ సెక్టార్‌లో గుత్తాధిపత్యాన్ని తగ్గించేందుకు కేంద్రం ముందున్న దారేంటి? తెలుసుకుందాం…! ఇది ఇండిగో సృష్టించిన సంక్షోభం అనొచ్చా డైరెక్టుగా.. ఇండిగో ఎప్పుడెప్పుడు ఎలా ప్రవర్తించిందన్న టైమ్ లైన్ చూస్తే.. కచ్చితంగా కావాలని చేసిన పని లాగే కనిపిస్తుంది. డిసెంబర్ 3: అశ్వత్థామ హతః అనే మాటలో కుంజరః అనే మాటను లో-వాయిస్‌లో...




