ట్రంప్ భారత పర్యటన ఖరారు.. 24 -25 తేదీల్లో ఢిల్లీ రాక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటనకు గాను ఇండియాకు రానున్నారు. ఈ నెల 24-25 తేదీల్లో ఆయన ఢిల్లీ, అహ్మదాబాద్ నగరాలను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా భారత-అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మక, ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఉభయ దేశాల నేతలూ (ట్రంప్, ప్రధాని మోదీ) ఒప్పందాలు కుదుర్చుకోనున్నారని వైట్ హౌస్ ప్రకటించింది. ఫస్ట్ లేడీ మెలనియాతో బాటు ట్రంప్ ఇండియాను విజిట్ చేయనున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ స్టెఫానీ గ్రిషమ్ […]

ట్రంప్ భారత పర్యటన ఖరారు.. 24 -25 తేదీల్లో ఢిల్లీ రాక
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 23, 2020 | 12:34 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటనకు గాను ఇండియాకు రానున్నారు. ఈ నెల 24-25 తేదీల్లో ఆయన ఢిల్లీ, అహ్మదాబాద్ నగరాలను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా భారత-అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మక, ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఉభయ దేశాల నేతలూ (ట్రంప్, ప్రధాని మోదీ) ఒప్పందాలు కుదుర్చుకోనున్నారని వైట్ హౌస్ ప్రకటించింది. ఫస్ట్ లేడీ మెలనియాతో బాటు ట్రంప్ ఇండియాను విజిట్ చేయనున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ స్టెఫానీ గ్రిషమ్ ప్రకటించారు. ఉభయ దేశాల నేతలూ ఇటీవల ఫోన్ లో మాట్లాడినట్టు ఆమె చెప్పారు. భారత, అమెరికా దేశాల ప్రజల మధ్య సౌభ్రాత్రం, స్నేహ భావాలు పటిష్టమయ్యేందుకు ట్రంప్ భారత పర్యటన దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ గ్లోబల్ ఆర్డర్ (అంతర్జాతీయ ప్రాపంచిక వ్యవస్థ)లో ఇండో-పసిఫిక్ రీజన్ తో బాటు సౌత్ చైనా సీ కూడా శాంతి, సామరస్యాలతో పరిఢవిల్లేలా చూడడంలో  ఇండియా కీలక పాత్ర పోషిస్తోందనన్నారు. గత సెప్టెంబరులో మోదీ అమెరికాను సందర్శించిన సందర్భంలో ఇండియాను విజిట్ చేయాల్సిందిగా ట్రంప్ ను ఆహ్వానించారు.

హూస్టన్ లో జరిగిన ‘ హౌ డీ మోడీ ‘ ఈవెంట్ సందర్భంగా ట్రంప్.. మోడీని పొగడ్తలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. ఫ్రెంచి టౌన్ బియారిట్జ్ లో నిర్వహించిన జీ-7 సమ్మిట్ సందర్భంలోనూ ఇద్దరు నేతలూ భేటీ అయ్యారు. కాగా-ట్రంప్ భారత పర్యటన అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదని యుఎస్-ఇండియా స్ట్రాటిజిక్ అండ్ పార్ట్ నర్ షిప్ ఫోరమ్ ప్రెసిడెంట్ ముఖేష్ అఘి పేర్కొన్నారు. అమెరికా అభివృధ్దిలో ఇండియా కూడా భాగస్వామి అన్న విషయాన్ని ట్రంప్ గుర్తించారని ఆయన చెప్పారు. ఈ అంశానికి ఎంతో విలువనిస్తున్నారని అన్నారు.