ఇదేం విచిత్రం.. శవానికీ ‘ఆధార్’ తప్పనిసరే…
Aadhar Mandatory: సిమ్ కార్డు తీసుకోవాలన్నా ఆధార్.. గ్యాస్ కొనాలన్నా ఆధార్.. బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్.. ఓటు హక్కు వినియోగించుకోవాలన్నా ఆధార్ తప్పనిసరి.. ఇలా మన బ్రతుకు జట్కా బండిలో ప్రతీ చిన్న పనికి ఆధార్‌ను అత్యవసరం చేసింది కేంద్ర ప్రభుత్వం. అంతేకాకుండా ఆధార్‌తో అనుసంధానం చేయించకపోతే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలు కూడా దక్కవని ప్రచారం చేస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇలా అన్నింటికీ ఆధార్ అవసరం కాగా.. అందులో తప్పులు దొర్లితే మాత్రం మార్చుకోవడం […]
Aadhar Mandatory: సిమ్ కార్డు తీసుకోవాలన్నా ఆధార్.. గ్యాస్ కొనాలన్నా ఆధార్.. బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్.. ఓటు హక్కు వినియోగించుకోవాలన్నా ఆధార్ తప్పనిసరి.. ఇలా మన బ్రతుకు జట్కా బండిలో ప్రతీ చిన్న పనికి ఆధార్‌ను అత్యవసరం చేసింది కేంద్ర ప్రభుత్వం. అంతేకాకుండా ఆధార్‌తో అనుసంధానం చేయించకపోతే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలు కూడా దక్కవని ప్రచారం చేస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇలా అన్నింటికీ ఆధార్ అవసరం కాగా.. అందులో తప్పులు దొర్లితే మాత్రం మార్చుకోవడం కష్టతరమేనని చెప్పాలి. ఇకపై చనిపోయిన వారికి దహన సంస్కారాలు చేయాలన్నా.. ఆధార్ తప్పనిసరిగా ఉండాల్సిందే.
ఆధార్ కార్డు లేకపోతే బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) అధికారిక శ్మశానాల్లో దహనం చేసే అనుమతులు లేని పరిస్థితి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటిదాకా ప్రభుత్వ పధకాలు పొందేందుకే ఉపయోగపడే ఈ ఆధార్‌ను శవాన్ని దహనం చేయడంలో కూడా తప్పనిసరి చేసిన బీబీఎంపీపై విమర్శలు వెల్లువెత్తాయి. వివరాల్లోకి వెళ్తే..
బెంగళూరులోని విజయనగర్‌కు చెందిన రాజేష్ అనే యువకుడి మేనత్త చనిపోవడంతో ఆమె మృతదేహానికి దహన సంస్కారాలు జరిపేందుకు కుటుంబసభ్యులతో కలిసి సుమనహళ్లి శ్మశానవాటికకు తీసుకువచ్చాడు. ఇక అక్కడ అతనికి అనూహ్య పరిణామం ఎదురైంది. శవ దహనాన్ని అడ్డుకున్న సిబ్బంది.. మృతురాలి ఆధార్ కార్డు కావాలని.. ఆ నెంబర్‌తో ఆన్లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని తెలిపారు. కొంతసేపు మున్సిపల్ సిబ్బందితో ఆమె కుటుంబసభ్యులు వాదించినా.. చేసేదేమిలేక ఆధార్‌ను అనుసంధానం చేశాకే దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఏది ఏమైనా బ్రతికున్న వాళ్ళకే ఆధార్ బాధలు అనుకుంటే చివరికి శవాలకు కూడా అవి తప్పడంలేదు.