అయోధ్య తీర్పుపై వ్యాఖ్యల ఫలితం.. చిక్కుల్లో ఒవైసీ

అయోధ్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇఛ్చిన తీర్పుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చిక్కుల్లో పడ్డారు. ఆయనచేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఇండోర్ (మధ్యప్రదేశ్) కోర్టులో సునీల్ శర్మ అనే లాయర్ ఫిర్యాదు చేశారు. కోర్టు ధిక్కరణగా ఒవైసీ కామెంట్స్ ను పరిగణించాలని, ఆయన మాటలు అభ్యంతరకరంగా, మతపరమైన సెంటిమెంట్లను రెచ్చగొట్టేవిగా ఉన్నాయని వర్మ పేర్కొన్నారు. 153 -ఎ , 295-ఎ సెక్షన్ల కింద, ఐటీ యాక్ట్ లోని వివిధ సెక్షన్ల కింద ఒవైసీని […]

అయోధ్య తీర్పుపై వ్యాఖ్యల ఫలితం.. చిక్కుల్లో ఒవైసీ
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Nov 12, 2019 | 3:18 PM

అయోధ్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇఛ్చిన తీర్పుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చిక్కుల్లో పడ్డారు. ఆయనచేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఇండోర్ (మధ్యప్రదేశ్) కోర్టులో సునీల్ శర్మ అనే లాయర్ ఫిర్యాదు చేశారు. కోర్టు ధిక్కరణగా ఒవైసీ కామెంట్స్ ను పరిగణించాలని, ఆయన మాటలు అభ్యంతరకరంగా, మతపరమైన సెంటిమెంట్లను రెచ్చగొట్టేవిగా ఉన్నాయని వర్మ పేర్కొన్నారు. 153 -ఎ , 295-ఎ సెక్షన్ల కింద, ఐటీ యాక్ట్ లోని వివిధ సెక్షన్ల కింద ఒవైసీని ప్రాసిక్యూట్ చేయాలన్నారు. లోక్ సభ ఎంపీ, బారిస్టర్ కూడా అయిన ఒవైసీ.. సంయమనంగా వ్యవహరించి ఉండాల్సి ఉందని కానీ , కోర్టు తీర్పు పట్ల తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్.. ఈ ఆరోపణలోని నిజానిజాల నిగ్గు తేల్చాలని ‘ జుని ఇండోర్ ‘ పోలీసులను ఆదేశించారు. ఈ నెల 20 కల్లా నివేదిక సమర్పించాలని సూచించారు. అయోధ్య కేసులో సుప్రీం తీర్పుపై ఇటీవల వ్యాఖ్యానించిన ఒవైసీ..’ ఈ రూలింగ్ వాస్తవాలపై నమ్మకం సాధించిన విజయం ‘ గా వ్యంగ్యంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. తీర్పు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని కూడా ప్రకటించారు.