Tripura Peace: 30 ఏళ్ల సాయుధ పోరాటానికి తెర.. మిలిటెంట్ గ్రూపుల మధ్య శాంతి ఒప్పందం

30 ఏళ్ల సాయుధ పోరాటానికి తెరదించుతూ త్రిపురలో రెండు మిలిటెంట్ గ్రూపుల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. రెండు గ్రూపులు ఆయుధాలను వదులుకుని జనజీవన స్రవంతిలో చేరేందుకు అంగీకరించాయి. త్రిపురకు చెందిన నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర, ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ సంస్థల ప్రతినిధులతో శాంతి ఒప్పందాలపై సంతకాలు చేయించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.

Tripura Peace: 30 ఏళ్ల సాయుధ పోరాటానికి తెర.. మిలిటెంట్ గ్రూపుల మధ్య శాంతి ఒప్పందం
Govt Signs Peace Deal With 2 Tripura Groups
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 05, 2024 | 9:09 AM

30 ఏళ్ల సాయుధ పోరాటానికి తెరదించుతూ త్రిపురలో రెండు మిలిటెంట్ గ్రూపుల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. రెండు గ్రూపులు ఆయుధాలను వదులుకుని జనజీవన స్రవంతిలో చేరేందుకు అంగీకరించాయి. త్రిపురకు చెందిన నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర, ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ సంస్థల ప్రతినిధులతో శాంతి ఒప్పందాలపై సంతకాలు చేయించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.

ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి, త్రిపురకు చెందిన తీవ్రవాద సంస్థలకు శాంతి ఒప్పందం జరిగింది. త్రిపురకు చెందిన నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర, ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ సంస్థల ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం, త్రిపుర ప్రభుత్వం శాంతి ఒప్పందాలపై సంతకాలు చేశాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, త్రిపుర సీఎం మాణిక్ సాహ సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. 30 ఏళ్ల సాయుధ పోరాటానికి ముగింపు పలుకుతున్నామని ఎన్ఎల్ఎఫ్‌‌టీ స్పష్టం చేసింది. హోంమంత్రిపై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపింది. తాము ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నామని ఎన్ఎల్ఎఫ్‌‌టీ సభ్యులు తెలిపారు.

ఇక ఈ ఒప్పందం కాగితం ముక్క కాదని, హృదయాల కలయిక అని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. త్రిపురలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని, ఈ ప్రాంత అభివృద్దికి పూర్తి సహాయ సహకారాలు అందించడమే ఈ శాంతి ఒప్పందాల లక్ష్యం అన్నారు. గత 10 ఏళ్లలో ఈశాన్య ప్రాంతంలో డజనుకు పైగా శాంతి ఒప్పందాలు జరిగాయని, అందులో 3 ఒప్పందాలు త్రిపురకు సంబంధించినవేనని తెలిపారు. త్రిపుర భవిష్యత్తు ఉజ్వలంగా ఉండనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు దాదాపు 10 వేల మండి తిరుగుబాటు దారులు ఆయుధాలు వదిలి, జనజీవన స్రవంతిలో కలిశారని అమిత్‌ షా తెలిపారు. ఇప్పుడు జరిగిన ఒప్పందంతో మరింతమంది ఆయుధాలు వదిలేస్తారన్నారు. ఇక వీరందరి జీవనోపాధి కోసం పథకాలు రూపొందిస్తామని సీఎం మాణిక్ సాహ తెలిపారు. మరోవైపు ఈ ఏడాది మార్చి నెలలో త్రిపురలోని ఆదివాసీల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..