జవాన్లు టార్గెట్‌గా మరో గ్రేనేడ్ దాడి.. 14 మందికి గాయాలు
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మీ జవాన్లను టార్గెట్ చేస్తూ.. మరోసారి గ్రేనేడ్ దాడికి పాల్పడ్డారు. అనంతనాగ్ జిల్లాలోని డిప్యూటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద గ్రేనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 14 మంది గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన మిగతా జవాన్లు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గాయపడ్డవారిలో […]
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మీ జవాన్లను టార్గెట్ చేస్తూ.. మరోసారి గ్రేనేడ్ దాడికి పాల్పడ్డారు. అనంతనాగ్ జిల్లాలోని డిప్యూటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద గ్రేనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 14 మంది గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన మిగతా జవాన్లు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గాయపడ్డవారిలో ఓ ట్రాఫిక్ పోలీసు, జర్నలిస్టు కూడా ఉన్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. కాగా, దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల కోసం భద్రతా సిబ్బంది కూంబింగ్ చేపడుతున్నారు.