Mallojula Venugopal Rao: మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్.. అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగుబాటు..
మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది.. మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు @ సోను ఆయుధాలు వీడారు.. మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా వ్యవహరించిన మల్లోజుల వేణుగోపాల్.. మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. 60 మంది మావోయిస్టులతో కలిసి మల్లోజుల వేణుగోపాల్ రావు పోలీసులకు లొంగిపోయారు.

మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది.. మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు @ సోను ఆయుధాలు వీడారు.. మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా వ్యవహరించిన మల్లోజుల వేణుగోపాల్.. మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. 60 మంది మావోయిస్టులతో కలిసి మల్లోజుల వేణుగోపాల్ రావు పోలీసులకు లొంగిపోయారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మల్లోజుల పోలీసులకు లొంగిపోయారు.. కాగా.. గతంలో కిషన్‌జీ పేరుతో మల్లోజుల వేణు సోదరుడు మల్లోజుల కోటేశ్వర రావు మావోయిస్టుపార్టీలో పనిచేశారు. కాగా.. అగ్రనేతగా ఎదిగిన మల్లోజుల వేణుగోపాల్ మావోయిస్టు పార్టీ ప్రస్తుత విధానాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. కొన్నిరోజుల కిందట లేఖ రాశారు. ఇది సంచలనంగా మారింది..
కాగా.. మావోయిస్టు పార్టీని వీడుతున్నట్టు కొన్నాళ్ల కిందటే మల్లోజుల లీకు ఇచ్చారు.. పార్టీ లక్ష్యం గతి తప్పిందంటూ కూడా కామెంట్ చేశారు. పొలిట్‌బ్యూరో మెంబర్‌గా సుదీర్ఘ కాలంపాటు మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషించిన మల్లోజుల.. అనవసర త్యాగాలు ఇక వద్దంటూ ఆ 22 పేజీల లేఖలో పేర్కొన్నారు. ఆయుధాలు వీడాలన్న నిర్ణయంపై కేడర్‌కి క్లారిటీ ఇచ్చారు. అగ్రనేత ప్రకటనతో ఉద్యమంలో అప్పుడే అలజడి మొదలైంది. ఆ తర్వాత చాలా మంది మావోయిస్టులు ఆయుధాలు వీడి పోలీసులకు లొంగిపోయారు.
వరుస ఎన్‌కౌంటర్లు.. ఈ ఘటనల్లో అగ్రనేతలు సహా.. కేడర్ వందల సంఖ్యలో చనిపోవడం.. అలాగే.. మావోయిస్టులు భారీగా లొంగిపోవడం.. ఈ క్రమలోనే.. మల్లోజుల పోలీసుల ఎదుట లొంగిపోవడం.. ఇవన్నీ మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా పేర్కొంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




