AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madvi Hidma Encounter: లొంగిపోవాలనుకున్న హిడ్మా.. అంతలోనే ఎన్‌కౌంటర్.. ఇదే సాక్ష్యం

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత సంచలన అంశాలు బయటికి వస్తున్నాయి. లొంగిపోయే ప్రయత్నాల్లో ఉండగానే హిడ్మా, అతని భార్య ఎన్‌కౌంటర్‌ అయ్యారు. కొద్దిరోజుల క్రితమే ఆయుధాలను అడవిని వదిలేసి హిడ్మా జనజీవ స్రవంతిలో కలవాలనుకున్నారు. ఈలోపే ఏపీ పోలీసుల కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ మడవి హిడ్మా హతమయ్యారు.

Madvi Hidma Encounter: లొంగిపోవాలనుకున్న హిడ్మా.. అంతలోనే ఎన్‌కౌంటర్.. ఇదే సాక్ష్యం
Hidma
Vijay Saatha
| Edited By: |

Updated on: Nov 19, 2025 | 9:08 AM

Share

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత సంచలన అంశాలు బయటికి వస్తున్నాయి. లొంగిపోయే ప్రయత్నాల్లో ఉండగానే హిడ్మా, అతని భార్య ఎన్‌కౌంటర్‌ అయ్యారు. కొద్దిరోజుల క్రితమే ఆయుధాలను అడవిని వదిలేసి హిడ్మా జనజీవ స్రవంతిలో కలవాలనుకున్నారు. ఈలోపే ఏపీ పోలీసుల కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ మడవి హిడ్మా హతమయ్యారు. కొద్దిరోజుల క్రితం ఛత్తీస్‌ఘడ్ బస్తర్‌లో ఉన్న ఒక విలేఖరికి హిడ్మా లేఖ రాశారు.. ఆయుధాలు విడిచే ముందు తాను కొన్ని అంశాలపై చర్చించాలనుకున్నట్లు జర్నలిస్టుకి రాసిన ఆ లేఖలో పేర్కొన్నారు. తమ భద్రతకు భరోసా కల్పిస్తే సరేండర్ అయ్యేందుకు సిద్ధం అన్నట్లు ఆ లేఖ సారాంశం ఉంది. లొంగుబాటుకు సంబంధించి ఎక్కడ..? ఏ ప్రదేశం అన్నది నిర్ణయించాల్సి ఉందని ఆ లేఖలో హిడ్మా పేర్కొన్నారు.

తనను కలిసేందుకు ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిందిగా ఆ జర్నలిస్టును హిడ్మా కోరారు. హిడ్మా నవంబర్ 10 న ఈ లేఖ రాసినట్లు ఆలస్యంగా బయటపడింది.. అయితే అందరూ లొంగిపోయేందుకు సిద్ధంగా లేరని సైతం ఆ లేఖలో పేర్కొన్నారు.

తన ఆలోచనలతోపాటు నిర్ణయాలపై వీడియో రిలీజ్ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు విలేఖరికి రాశారు. నాలుగైదు రోజుల్లో హిందీతో పాటు తెలుగులోనూ ఒక ఆడియో స్టేట్మెంట్ ఇవ్వనున్నట్లు కూడా ఆ లేఖలో ఉంది. ఆయుధాలు విడిచే ముందు కొన్ని అంశాలు చర్చించాల్సి ఉందని లేఖలో సుధీర్ఘంగా హిడ్మా రాసినట్లు తెలుస్తోంది.

ఇంతలోనే ఏపీ బలగాల చేతిలో హిడ్మా ఎన్కౌంటర్‌కు గురయ్యారు. మరోవైపు హిడ్మా ఎన్కౌంటర్ తోపాటు.. మావోయిస్టుల అరెస్టుపై ఏపీ పోలీసులు ఈరోజు అధికారికంగా ప్రకటించనున్నారు. రంపచోడవరం ఏరియా హాస్పిటల్ లో హెడ్మాతోపాటు అతని భార్య రాజే అలియాస్ రాజక్క మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం కోసం కాకినాడ వైజాగ్ నుండి ఫోరెన్సిక్ బృందం రంపచోడవడానికి రానుంది.

ఇప్పటికే హిడ్మా మరణ వార్తను ఛత్తీస్‌ఘడ్ లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు పోలీసులు చేరవేర్చారు. వారందరూ రంపచోడవరానికి చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు హిడ్మా మృతదేహాన్ని అప్పగించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
భర్త ఫోటో రివీల్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి..
భర్త ఫోటో రివీల్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి..
700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత
700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత
రన్నింగ్‌ ట్రైన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందా? టెన్షనొద్దు!
రన్నింగ్‌ ట్రైన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందా? టెన్షనొద్దు!
చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
లావణ్య త్రిపాఠికి ఇంత అందమైన అక్క ఉందా? ఫొటోస్ ఇదిగో
లావణ్య త్రిపాఠికి ఇంత అందమైన అక్క ఉందా? ఫొటోస్ ఇదిగో