ఉగ్రవాదులకు భారీ షాక్.. మరో టాప్‌ కమాండర్‌ హతం

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులకు భారీ షాక్‌లు తగులుతున్నాయి. గత కొద్ది రోజులుగా లాక్‌డౌన్ కొనసాగుతున్న క్రమంలో తరచూ దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. అయితే సైన్యం ఎప్పటికప్పుడు వారి స్కెచ్‌లను తిప్పికొడుతోంది. తాజాగా మూడు రోజుల క్రితం భారతసైన్యంపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడికి దిగారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. అయితే అప్పటి నుంచి సైన్యం ఉగ్రవాదుల కోసం విస్త్రతంగా కూంబింగ్ చేపడుతున్నారు. ఈ క్రమంలో పుల్వామా జిల్లాలోని శార్షాలి గ్రామంలో ఉగ్రవాదులు […]

ఉగ్రవాదులకు భారీ షాక్.. మరో టాప్‌ కమాండర్‌ హతం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 06, 2020 | 4:55 PM

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులకు భారీ షాక్‌లు తగులుతున్నాయి. గత కొద్ది రోజులుగా లాక్‌డౌన్ కొనసాగుతున్న క్రమంలో తరచూ దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. అయితే సైన్యం ఎప్పటికప్పుడు వారి స్కెచ్‌లను తిప్పికొడుతోంది. తాజాగా మూడు రోజుల క్రితం భారతసైన్యంపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడికి దిగారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. అయితే అప్పటి నుంచి సైన్యం ఉగ్రవాదుల కోసం విస్త్రతంగా కూంబింగ్ చేపడుతున్నారు.

ఈ క్రమంలో పుల్వామా జిల్లాలోని శార్షాలి గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందడంతో.. భద్రతా బలగాలు పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు సైన్యంపైకి కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులకు దిగింది. ఈ ఘటనలో హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ రియాజ్ నాయకూ హతమయ్యాడు. ఏ ప్లస్ ప్లస్ కేటగిరికి చెందిన ఈ ఉగ్రవాది రియాజ్‌పై రూ.12 లక్షల రూపాయల రివార్డ్ కూడా ఉంది. రియాజ్‌తో పాటు మరో ఉగ్రవాది కూడా హతమైనట్లు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలంలో పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరికొంత మంది ఉగ్రవాదుల కోసం ఇంకా కూంబింగ్ చేపడుతున్నారు.