Agriculture States: భారతదేశంలో అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి చేసే ఐదు రాష్ట్రాలు.. ఆ రాష్ట్రం మొదటి స్థానంలో..

Subhash Goud

Subhash Goud |

Updated on: Oct 17, 2021 | 5:12 PM

Agriculture States: ధాన్యం పండించడంలో భారత్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ధాన్యం ఉత్పత్తి విషయంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్ర దేశాలలో చోటు సంపాదించుకుంది..

Agriculture States: భారతదేశంలో అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి చేసే ఐదు రాష్ట్రాలు.. ఆ రాష్ట్రం మొదటి స్థానంలో..

Follow us on

Agriculture States: ధాన్యం పండించడంలో భారత్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ధాన్యం ఉత్పత్తి విషయంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్ర దేశాలలో చోటు సంపాదించుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం.. 2020-21లో భారత్‌ 298.3 మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో దాదాపు 159 మిలియన్‌ హెక్టార్ల సాగు భూమి ఉంది. అదే అమెరికాలో 174 మిలియన్‌ హెక్టార్లు ఉంది. దేశంలో అనేక రాష్ట్రాలు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పశ్చిమ బెంగాల్‌ ముందంజలో ఉంది. ప్రపంచంలో మొత్త వార్షిక బియ్యం ఉత్పత్తి 700 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు. ఇందులో దాదాపు 15 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల బియ్యం బెంగాల్‌లోనే ఉత్పత్తి అవుతుంది. బియ్యంతో పాటు మామిడి, జామ, పైనాపిల్‌, ఆరెంజ్‌వంటి పండ్లు కూడా ఇక్కడే అధికంగా పండిస్తారు. మరోవైపు టమోటా, క్యాబేజీ, ఓక్రా, వంకాయలను కూడా పెద్ద ఎత్తున సాగు చేస్తారు. పశ్చిమ బెంగాల్‌ తర్వాత ఉత్తర ప్రదేశ్‌ ఉంది. యూపీ గోధుమ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. ఇది దేశంలో గోధుమ ఉత్పత్తిలో 35 శాతం వరకు ఇక్కడే పండించడం జరుగుతుంది. యూపీలోని తూర్పు, పశ్చిమ, ఉత్తర ప్రాంతాలలో సుమారు 96 లక్షల హెక్టార్లలో గోధుమ సాగు అవుతుంది. చెరుకు సాగులో ఈ రాష్ట్రం కూడా ముందుంది.

గోధుమ సాగులో..

దేశంలో ధాన్యం పండించే రాష్ట్రాలలో పంజాబ్‌ ధాన్యం అధికంగా పండిస్తారు. ఈ రాష్ట్రంలో ప్రతియేడాది దాదాపు 12 మిలియన్‌ టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇక గోధుమ ఉత్పత్తిలోనూ పంజాబ్‌ అగ్ర రాష్ట్రాలలో ఒకటి. దేశంలో మొత్తం ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ మూడో స్థానంలో ఉంవది.

వేరు శనగ, ఆముదంలో..

ఇక వేరు శనగ, ఆముదం సాగులో గుజరాత్‌ మొదటి స్థానంలో ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా తక్కువ వర్షపాతం కారణంగా ఖరీఫ్‌ సీజన్‌ సాగు గణనీయంగా దెబ్బతింది. దీంతో దిగుబడి కూడా తగ్గిపోయింది. హర్యానాలో 70 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధార పడి జీవిస్తున్నారు. దేశంలో హరిత విప్లవాన్ని తీసుకురావడంలో హర్యానా ప్రముఖ పాత్ర పోషిస్తుందంటుంటారు. గోధుమ, వరి, చెరుకు, పొద్ద తిరుగుడు మొదలైన పంటలు ఇక్కడ అధికంగా సాగు చేస్తారు. ఇక పొద్దు తిరుగుడు పంట సాగులో హర్యానా దేశంలోనే రెండో స్థానంలో ఉంది. అలాగే ఈ రాష్ట్రం పశుపోషనలో కూడా ముందుంది.

ఇవీ కూడా చదవండి:

Women Health Benefits: మహిళలు ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే ఆ సమస్యలు దూరం..!

Praising Children: పిల్లలను అతిగా ప్రశంసిస్తున్నారా..? అయితే జాగ్రత్త.. తాజా పరిశోధనలో కీలక విషయాలు..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu