చైనాతో సంబంధాలు క్షీణించలేదు, పార్లమెంట్ లో కేంద్రం
లడాఖ్ లో గత జూన్ 15 న భారత, చైనా దళాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగి 20 మంది భారత సైనికులు అమరులైనప్పటికీ, చైనాతో భారత సంబంధాలు క్షీణించలేదని కేంద్రం తెలిపింది. ఇప్పటికీ ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలు..

లడాఖ్ లో గత జూన్ 15 న భారత, చైనా దళాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగి 20 మంది భారత సైనికులు అమరులైనప్పటికీ, చైనాతో భారత సంబంధాలు క్షీణించలేదని కేంద్రం తెలిపింది. ఇప్పటికీ ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నా, చైనాతో ఇండియా సంబంధాలు దిగజారలేదని విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ లోక్ సభలో ఓ లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. గత ఆరు నెలల్లో ఇండో-చైనా బోర్డర్ లో చొరబాట్లు జరగలేదని అంతకుముందు రాజ్యసభలో హోం శాఖ తెలిపింది. గత నాలుగు నెలలకు పైగా తూర్పు లడాఖ్ ఖ్ ప్రాంతంలో రెండు దేశాల మధ్య తరచూ ఉద్రిక్తత తలెత్తుతున్నా..ఈ రెండు శాఖలో దాదాపు ఒకే విధమైన ప్రకటనలు చేయడం విశేషం. ఓ వైపు చైనా తాము శాంతికైనా, యుధ్ధానికైనా సిధ్దమని జబ్బలు చరుస్తుంటే..’అంతా బాగానే ఉందని, ఎలాంటి ఆందోళనా అనవసరమని’, కేంద్రం చెబుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం కూడా తన ట్వీట్లలో ఇదే విషయాన్నీ ప్రస్తావించారు.