Noorjahan Mango: ‘నూర్జహాన్’ మామిడి.. ధర తెలిస్తే షాకే.. ఇంతకీ ఆ మ్యాంగో స్పెషల్ ఏంటంటే.!

అందరూ ఎంతగానో ఇష్టపడే నోరూరించే మామిడి పండు ధర మహా అయితే ఒకటి 20 రూపాయలు ఉంటుంది. అపురూపంగా లభించే కొన్ని రకాల..

Noorjahan Mango: 'నూర్జహాన్' మామిడి.. ధర తెలిస్తే షాకే.. ఇంతకీ ఆ మ్యాంగో స్పెషల్ ఏంటంటే.!
Mango
Follow us

|

Updated on: Jun 07, 2021 | 4:10 PM

మామిడి పండ్లు.. పండ్లకు రారాజు అంటుంటారు. వేసవి వచ్చిందంటే చాలు.. మార్కెట్‌లో ఎక్కడ చూసినా మామిడి పండ్లే కనిపిస్తాయి. సీజన్ కావడంతో ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. కేవలం ఎండాకాలంలో మాత్రమే లభించే ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సహజంగా మామిడి పండు ధర మహా అయితే ఒకటి రూ. 20 ఉంటుంది. అదే మేలు రకం జాతి పండ్లు అయితే కాసింత ధర ఎక్కువ పలుకుంతుంది. కానీ మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో మాత్రమే పండే ఓ మామిడి పండు ధర మాత్రం ఆకాశాన్ని అంటుతోంది. ఆ మామిడి ఒక్కొక్కటి దాదాపు రూ. 500-1000 వరకు ధర పలుకుతుండటం గమనార్హం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో మాత్రమే పండే ‘నూర్జహాన్’ మామిడి పండ్లు చాలా ప్రత్యేకమైనవి. జనవరి నెలలో పూతకు వచ్చే ఈ రకం పండ్లు జూన్ నెలలో లభిస్తాయి. ఈ మామిడి పండ్లు ఒక్కొక్కటి రూ. 500-1000 వరకు పలుకుతాయని అక్కడి రైతులు చెబుతున్నారు. ఈ మామిడి ఒకటి రెండున్నర నుంచి మూడు కిలోల వరకు తూగుతుందని అక్కడి స్థానికులు అంటున్నారు. వాటి సైజ్ పెద్దదిగా ఉండటమే కాకుండా పూతకు వచ్చినప్పుడే వినియోగదారులు బుక్ చేసుకుంటుండటంతో ధర దాదాపు 1000 రూపాయలు పలుకుతుందని అంటున్నారు.

అఫ్ఘానిస్థాన్ ప్రాంతానికి చెందిన ఈ నూర్జహాన్ మామిడిని గుజరాత్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న అలీరాజ్‌పూర్ జిల్లా కత్తివాడ ప్రాంతంలో మాత్రమే సాగు చేస్తారు. గత ఏడాది వాతావరణం బాగోకపోవడంతో నూర్జహాన్ చెట్లకు సరిగ్గా పూత పూయలేదని.. ఈ ఏడాది పంట బాగున్నా కోవిడ్ కారణంగా వ్యాపారం అంతంతమాత్రంగానే జరుగుతుండటంతో రైతులు దిగాలుగా ఉన్నారు.

Also Read:

ప్రతీ నెలా రూ. 3810 డిపాజిట్ చేస్తే.. మీ కూతురు కోసం రూ. 27 లక్షలు పొందొచ్చు.. పూర్తి వివరాలు..

కరీంనగర్‌లో అరుస్తున్న పాము.? అసలు ఇందులో నిజమెంత..

టీమిండియా చరిత్రలో చెత్త మ్యాచ్.. జీరోకి నాలుగు వికెట్లు.. ఆ ఇంగ్లీష్ బౌలర్ ఎవరంటే.?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5కు ముహూర్తం ఫిక్స్.! కంటెస్టెంట్స్ వీరేనా.!!

ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అమలులోకి కొత్త రూల్స్.. విత్‌డ్రా పరిమితి పెంపు..

Latest Articles