AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోట్లకు కోట్లు ఉన్నా అంతిమ కోరిక మాత్రం తీరలేదు

కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే? వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? అంటాడు భాగవతంలో పోతన! నిజమే, ఎంత సంపాదించినా పోతున్నప్పుడు వాటిని మూటగట్టుకుని పోలేం కదా!

కోట్లకు కోట్లు ఉన్నా అంతిమ కోరిక మాత్రం తీరలేదు
The Ultimate Wish Has Not Been Fulfilled
Balu
| Edited By: Phani CH|

Updated on: Apr 29, 2021 | 10:23 PM

Share

కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే? వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? అంటాడు భాగవతంలో పోతన! నిజమే, ఎంత సంపాదించినా పోతున్నప్పుడు వాటిని మూటగట్టుకుని పోలేం కదా! కోట్లాది రూపాయలున్నవారు అంతిమ కోరికలను ఎలాగోలా తీర్చుకుంటారు.. పాడు కరోనా.. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా చేసింది.. కరోనా మహమ్మారి అంత్యక్రియలను కూడా సరిగ్గా చేయించనివ్వడంలేదు.. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాలకు చెందిన ఓ బంగారం వ్యాపారికి కరోనా సోకింది. ఆ మహమ్మారితో ఓ వారం రోజుల పాటు పోరాడారు. చివరకు కరోనానే గెలిచింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే తనకు అంతిమఘడియలు సమీపించాయన్న సంగతి ఆయనకు తెలిసినట్టు ఉంది.. అందుకే తాను చనిపోయిన తర్వాత రేగొండ మండలం దమ్మన్నపేటలో ఉన్న ఎర్రచందనం వనంలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులకు సూచించారు. ఆయన అంతిమ కోరిక తీర్చడం ధర్మం కాబట్టి కుటుంబసభ్యులంతా మృతదేహాన్ని తీసుకుని దమ్మన్నపేటకు వచ్చారు.. తీరా అక్కడికి వచ్చేసరికి గ్రామస్తులు సరిహద్దులోనే వారిని అడ్డుకున్నారు. కరోనాతో చనిపోయాడు కాబట్టి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించడానికి వీల్లేదని కర్కష హృదయంతో నిష్కర్షగా చెప్పారు. కుటుంబసభ్యులు బతిమాలారు, వేడుకున్నారు. అయినా వారు కరగలేదు. కనీసం గుంత తవ్వడానికి కూడా జేసీబీ డ్రైవర్లు ముందుకు రాకపోవడం గమనార్హం. విషాదంతో మళ్లీ మృతదేహాన్ని పరకాల శివారు చలివాగు ఒడ్డున ఉన్న స్మశాన వాటికకు తీసుకొచ్చి అక్కడ అంత్యక్రియలను నిర్వహించారు కుటుంబసభ్యులు. చనిపోయిన బంగారు వ్యాపారికి పరకాల పట్టణంలో మూడు చోట్ల కోట్ల రూపాయల విలువైన మూడంతస్తులు భవనాలు ఉన్నాయి. వ్యవసాయ మార్కెట్‌ ఎదురుగా కోట్లు విలువ చేసే షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఉంది. అయినా.. అంతిమ కోరికను నెరవేర్చుకోలేని దుస్థితి..ముదనష్టపు కరోనా ఇంకెన్ని వైపరీత్యాలను చూపిస్తుందో!

మరిన్ని ఇక్కడ చూడండి: ఢిల్లీకి బాసు కేజ్రీవాల్‌ కాదు, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కే అధికారాలు

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం.. రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..!