Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hate Speech: విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఫిర్యాదు లేకున్నా కేసులు నమోదు.. లేదంటే..

విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదు లేకున్నా కేసులు నమోదు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. కేసులు పెట్టకుంటే కోర్టు ధిక్కరణ అవుతుందని వార్నింగ్‌ ఇచ్చింది.

Hate Speech: విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఫిర్యాదు లేకున్నా కేసులు నమోదు.. లేదంటే..
Supreme Court Of India
Follow us
Venkata Chari

|

Updated on: Apr 29, 2023 | 6:35 AM

దేశంలో మరో ముఖ్యమైన అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలకాదేశాలు ఇచ్చింది. పలు రాష్ట్రాల్లో పెరిగిపోతున్న విద్వేష ప్రసంగాల సంస్కృతికి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. విద్వేష ప్రసంగాలు చేసే వారిపై చర్యలు తీసుకునే విషయంలో రాష్ట్రాలు అలసత్వం వహిస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. విద్వేష ప్రసంగాలకు సంబంధించి ఫిర్యాదు అందకున్నా, జాప్యమైనా.. సుమోటోగా కేసులు నమోదు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. లేనిపక్షంలో.. కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరించింది సుప్రీంకోర్టు.

విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం దేశ లౌకిక నిర్మాణాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం.. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీచేసింది. మతం పేరుతో ఎక్కడికి చేరుకున్నాం.. మతాన్ని ఎక్కడికి తీసుకెళ్లామనే విషయం చాలా విషాదకరమని సుప్రీం ధర్మాసనం గతేడాది అక్టోబరులో చేపట్టిన విచారణలో అభిప్రాయపడింది. విద్వేష ప్రసంగాలు చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఉత్తర్‌ప్రదేశ్‌, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు సూచించింది. ఫిర్యాదు వచ్చే వరకు వేచిచూడకుండా వారిపై కేసులు నమోదు చేయాలని స్పష్టం చేసింది. మతాలతో సంబంధం లేకుండా ఈ ఆదేశాలు అమలు చేయాలని.. ఇంతటి తీవ్రమైన సమస్యకు సంబంధించి చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమైతే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది.

ఇక.. విద్వేష ప్రసంగాలు చేసే వారిపై చర్యలు తీసుకునేలా గతంలో మూడు రాష్ట్రాలకు జారీ చేసిన ఆదేశాలను అన్ని రాష్ట్రాలు వర్తింపజేయాలంటూ తాజాగా దాఖలైన పలు పిటిషన్లపై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే.. గత ఆదేశాల పరిధిని పెంచుతూ.. తాజాగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకూ వర్తిస్తాయని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..