ఘోరాతి ఘోరం.. రూ.20 ఆశచూపి నాలుగో తరగతి బాలికపై దారుణం.. అంతటితో ఆగకుండా..

సమాజంలో మానవ మృగాలు రోజురోజుకు పెరిగిపోతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దాడులు, అత్యాచారాలు, హత్యలు చేస్తున్నారు. మహిళలు,...

ఘోరాతి ఘోరం.. రూ.20 ఆశచూపి నాలుగో తరగతి బాలికపై దారుణం.. అంతటితో ఆగకుండా..
harassment
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 22, 2023 | 1:54 PM

సమాజంలో మానవ మృగాలు రోజురోజుకు పెరిగిపోతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దాడులు, అత్యాచారాలు, హత్యలు చేస్తున్నారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా అవి క్షేత్రస్థాయిలో నేరగాళ్లల్లో మార్పు తీసుకురావడం లేదు. తాజాగా.. పశ్చిమబంగలో జరిగిన ఓ ఘటనే ఇందుకు నిదర్శనం. రూ.20 ఆశచూపి బాలికపై అత్యాచారం చేశాడు ఓ యువకుడు. అంతే కాకుండా జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని, చెబితే చంపేస్తానని బెదిరించడం గమనార్హం. పశ్చిమబంగ రాష్ట్రంలోని దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని కానింగ్‌లో ఓ యువకుడు రిక్షా నడుపుకుంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం నాలుగో తరగతి విద్యార్థిని పాఠశాలకు వెళుతుండగా.. సదరు యువకుడు ఆమెను అడ్డుకున్నాడు. రూ.20 ఇస్తానని ఆశచూపి.. పాడుబడిన దుకాణంలోకి తీసుకెళ్లాడు. అక్కడ కొన్ని గంటల పాటు చిన్నారిని బంధించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

అత్యాచారం అనంతరం జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని బెదిరించాడు. చెప్తే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అక్కడి నుంచి ఇంటికి చేరుకున్న బాలిక ఏడుస్తూ.. జరిగిన దురాగతాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. దీంతో వారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతన్ని అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశఆరు. అతడిని అరెస్ట్ చేసి ఈరోజు (మంగళవారం) అలీపూర్ కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు, నిందితుడు.. “ఇందులో నా ప్రమేయం ఏమీ లేదని, ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారని, కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నారని నిందితుడు ఆరోపించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో