కేంద్రం యూటర్న్.. ఇకపై ఆ యాప్ ఫోన్లలో తప్పనిసరి కాదట.. కారణం ఏంటంటే..?
కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఇకపై మొబైల్స్‌లో సంచార్ సౌథీ యాప్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు మొబైల్ కంపెనీలకు ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకుంది. గతంలో అన్నీ ఫోన్లలో ఈ యాప్ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం ఆదేశించింది.

Sanchar Saathi APP: ప్రతీఒక్కరీ ఫోన్లతో భద్రత కోసం సంచార్ సౌథీ యాప్ తప్పనిసరిగా డీఫాల్ట్‌గా ఉండాలని ఇటీవల మొబైల్ తయారీ సంస్థలు, టెలికాం కంపెనీలకు కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అన్ని ఫోన్లలో డిలీట్ చేసుకోవడానికి వీలు కాకుండా యాప్‌ను ఉంచాలని కేంద్రం సూచించింది. సైబర్ నేరాలు పెరుగుతుండటం, నకిలీ లింక్‌లు, మాల్‌వేర్ల ద్వారా బ్యాంక్ అకౌంట్లలోని డబ్బులు కొల్లగొట్టడం, ఫోన్ల చోరీ ఎక్కువ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఏమైందో ఏమో కానీ ఆ నిర్ణయం తీసుకున్న రెండు రోజుల్లోనే కేంద్రం వెనక్కి తగ్గింది. ఫోన్లలో తప్పనిసరిగా యాప్ ఉండాల్సిన అవసరం లేదంటూ యూటర్న్ తీసుకుంది. ఈ మేరకు మొబైల్ తయారీ సంస్థలు, టెలికాం కంపెనీలకు ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు టెలికాం శాఖ ప్రకటించింది. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతుందని, డెసిషన్ వెనక్కి తీసుకోవానికి ఇదే కారణమని స్పష్టం చేసింది.
యూటర్న్‌కు కారణమేంటి..?
కేంద్రం తప్పనిసరిగా ప్రీఇన్‌స్టాల్ చేయాలని తెలిపిన తర్వాత డౌన్‌లోడ్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. మంగళవారం ఒక్కరోజే 6 లక్షల ఇన్‌స్టాల్స్ అయ్యాయి. దీంతో డౌన్‌లోడ్ చేసుకున్నవారి సంఖ్య కోటికి చేరుకుంది. ప్రజల స్వచ్చంధంగా ఇన్‌స్టాల్ చేసుకున్న తరుణంలో మొబైల్ కంపెనీలు డీఫాల్ట్‌గా ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్రం గుర్తించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంలో మొబైల్ తయారీ కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అందుకే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఇన్‌స్టాల్ చేసుకున్నాక ఫోన్లలో యాప్‌ను ఎప్పుడైనా తొలగించుకోవచ్చని వెల్లడించింది.
రోజూ 2 వేల మంది ఫిర్యాదు
కాగా ఈ యాప్ ద్వారా రోజుకు 2 వేల మోసపూరిత ఘటనల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. సైబర్ నేరాలతో పాటు ఫోన్ల చోరీ గురించి కూడా ఫిర్యాదులు వస్తున్నాయి.దీంతో వారి ఫోన్లను గుర్తించి వెనక్కి తిరిగిచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో వెబ్‌సైట్ మాత్రమే ఉండేది. కానీ ఈ ఏడాది యాప్‌ను కూడా కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మీ పేరుపై ఎన్ని సిమ్‌లు ఉన్నాయనే విషయం తెలుసుకోవచ్చు. మీరు ఉపయోగించని సిమ్ కార్డులను ఈ ఫ్లాట్‌ఫామ్ ద్వారా తొలగించుకోవచ్చు. దీని వల్ల మీ సిమ్ కార్డులపై నేరాలు జరగకుండా నియంత్రించవచ్చు.




