AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘వందే భారత్’ ట్రెయిన్ టెండర్లు రద్దు, ఎందుకంటే ?

'వందే భారత్' పేరిట 44 సెమి హై స్పీడ్ రైళ్ల తయారీకి ఉద్దేశించిన ప్రాజెక్టు టెండర్లకు రైల్వే శాఖ స్వస్తి చెప్పింది. చైనాకు చెందిన సీసీఆర్ఆర్ సీ (ఇండియా)  పయోనీర్ ఎలెక్ట్రానిక్స్ సంస్థ ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొనడమే ఇందుకు కారణం.

'వందే భారత్' ట్రెయిన్ టెండర్లు రద్దు, ఎందుకంటే ?
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 22, 2020 | 9:55 AM

Share

‘వందే భారత్’ పేరిట 44 సెమి హై స్పీడ్ రైళ్ల తయారీకి ఉద్దేశించిన ప్రాజెక్టు టెండర్లకు రైల్వే శాఖ స్వస్తి చెప్పింది. చైనాకు చెందిన సీసీఆర్ఆర్ సీ (ఇండియా)  పయోనీర్ ఎలెక్ట్రానిక్స్ సంస్థ ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొనడమే ఇందుకు కారణం. వారంలోగా కొత్తగా టెండర్లు పిలుస్తామని, మేకిన్ ఇండియా ప్రోగ్రామ్ కే ప్రాధాన్యమిస్తామని రైల్వే శాఖ ట్వీట్ చేసింది. ఈ నిర్ణయం చైనాకు పెద్ద దెబ్బే. 44 సెమి హైస్పీడ్  రైళ్ల తయారీకి టెండర్లను ఆహ్వానించగా, ఆరు సంస్థలు ఈ టెండర్లలో పాల్గొన్నాయి. వీటిలో చైనా సంస్థ ఒక్కటే విదేశీ సంస్థ.  అయితే దీని టెండర్ రద్దు చేశామని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

చెన్నైలోని ఇంటి గ్రేడెడ్  కోచ్ ఫ్యాక్టరీ జులై 10 న టెండర్లను పిలిచింది. భారత్ హెవీ ఎలెక్ట్రిక్స్, భారత్ ఇండస్ట్రీస్ సహా మరో మూడు భారతీయ సంస్థలు ఈ ప్రక్రియలో పాల్గొన్నాయి. లడాఖ్ లో చైనా చొరబాటుతో  ఆ దేశ ఉత్పత్తులను బాయ్ కాట్ చేయాలని పరోక్షంగా ఉద్యమం ప్రారంభమైన నేపథ్యంలో రైల్వే శాఖ కూడా ఈ నిర్ణయం తీసుకుంది.