AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: అయోధ్య రామ మందిరానికి ఐదు వెండి ఇటుకలు దానం చేసిన వ్యక్తి.. ఈసారి ఏం చేశారో తెలుసా..?

యోధ్య శ్రీరామ మందిరంపై తెలుగు వారు చెరగని ముద్ర వేస్తున్నారు. ఆలయ ద్వారాల తయారీనే కాదు, స్వామి వారి పాదుకలను తయారుచేసిన అదృష్టం భాగ్యనగరానికి దక్కింది. రాములోరికి పాదుకా సేవ చేసుకుంటున్నారు చల్లా శ్రీనివాస శాస్త్రి. అయోధ్య వాసి అయిన చల్లా శ్రీనివాస్ శాస్త్రి జన్మస్థలం నిజామాబాద్.

Ayodhya: అయోధ్య రామ మందిరానికి ఐదు వెండి ఇటుకలు దానం చేసిన వ్యక్తి.. ఈసారి ఏం చేశారో తెలుసా..?
Challa Srinivasa Sastry Ayodhya
Peddaprolu Jyothi
| Edited By: Balaraju Goud|

Updated on: Jan 05, 2024 | 8:48 PM

Share

అయోధ్య శ్రీరామ మందిరంపై తెలుగు వారు చెరగని ముద్ర వేస్తున్నారు. ఆలయ ద్వారాల తయారీనే కాదు, స్వామి వారి పాదుకలను తయారుచేసిన అదృష్టం భాగ్యనగరానికి దక్కింది. అయోధ్య వాసి అయిన చల్లా శ్రీనివాస్ శాస్త్రి జన్మస్థలం నిజామాబాద్. అతను ఇంజనీరింగ్ పూర్తి చేసి చాలా సంవత్సరాలు సినీ ఫీల్డ్‌లో సౌండ్ ఇంజనీర్‌గా పని చేశారు. సీనియర్, జూనియర్ ఫిల్మ్ సెలబ్రిటీలందరితో కలిసి పని చేశారు. అతనే శ్రీ లక్ష్మీ సుందర శాస్త్రి. రాములోరికి పాదుకా సేవ చేసుకుంటున్నారు చల్లా శ్రీనివాస శాస్త్రి. రామ జన్మభూమి కర సేవలో పాల్గొన్న తండ్రి స్ఫూర్తితో అయోధ్య రామ మందిరం వరకు పాదయాత్ర చేసుకుంటూ బంగారు రామ పాదుకులను అయోధ్యకు చేర్చాలని భావిస్తున్నారు.

అయోధ్య తీర్పు వచ్చిన తర్వాత చల్లా శ్రీనివాస శాస్త్రికి రామునికి ఏదో ఒక వస్తువు ఇవ్వాలని సంకల్పంతో పట్టు పట్టుకుని కూర్చున్నారు. ఆ తరువాత ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన నాడు ఐదు వెండి ఇటుకలను అందించారు. ఇలా ఒక్కొక్క ఇటుక 2.5 కేజీల బరువున్న ఇటుకలను ప్రధాన మంత్రి మోదీ రామమందిరంలోని శిలాన్యాలలో ఉంచారు. అనంతరం కొంతమంది సలహాల మేరకు వాటిని బంగారు పూతతో కప్పి ఇస్తే బాగుంటుందని చెప్పడంతో, ఆ పాదుకలను బంగారు పూతతో తయారు చేయించారు. అలా ఆ పాదుకల బరువును 13 కిలోలకు తీసుకువచ్చారు.

అయితే బంగారు పాదుకుల తయారీ కంటే ముందుగానే వెండి పాదుకులను తలపై పెట్టుకుని 41 రోజులలో 41 సార్లు ప్రతిరోజూ అయోధ్య రామ మందిరం చుట్టు దాదాపు 38 కి.మీ. ప్రదక్షిణలు చేశారు శ్రీనివాస శాస్త్రి. అక్కడ పనులు మొదటి దశ లో ఉండటంతో, దైవిక సూచనలతో భారత్‌లోని హోలీ ప్రదేశాల చుట్టూ తిరిగి, ఆ వెండి పాదుకలను లండన్, దుబాయ్, మలేషియా, సింగపూర్‌, భద్రినాధ్, జ్యోతిర్లింగాల ప్రదేశాలలో ప్రత్యేక పూజలు చేయించారు.

తూర్పు గోదావరి జిల్లాలోని వెదురుపాక గ్రామానికి చెందిన గురుదేవ్ జీ దేవుని ఆశీర్వాదం పొందిన తర్వాత, భద్రాచలం వరకు పాద యాత్ర ప్రారంభించారు. అదే విధంగా అయోధ్యకు పయనమయ్యారు శ్రీనివాస శాస్త్రి. భద్రాచలం శ్రీ రామ భగవానుడు ఆరణ్యవాసంలోకి వెళ్ళిన మార్గం, తరువాత సీతామాతను వెతకడం ఇలా ఏ ప్రదేశాన్ని వదలకుండా పాదయాత్రను చేశారు. అంతేకాదు శ్రీ రామ భక్తులకు రోజూ 10,000 లడ్లు పంపిణీ చేయడంతో పాటు వారికి ఉచిత అన్న ప్రసాదం కూడా అందజేస్తు తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో తయారు చేయించిన శ్రీరామ పాదుకలు చల్లా శ్రీనివాస శాస్త్రి వద్దకు చేరాయి. అక్టోబర్ 7న పాదయాత్ర ప్రారంభం చేసినటువంటి చల్లా శ్రీనివాస శాస్త్రి జనవరి 13న అయోధ్యకు చేరుకోవాలని సంకల్పించారు. అక్కడికి చేరుకున్న తర్వాత బంగారం పాదుకులను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు అందజేయనున్నారు. అయితే ఆ పాదుకులకు 46 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లుగా చల్లా శ్రీనివాస శాస్త్రి చెప్తున్నారు. అందుకు గాను దాతల సహాయం కూడా తోడైందని తెలిపారు. రాముల వారి కోసం హైదరాబాద్‌లో 50 సంవత్సరాల పాటు ఉన్న శ్రీనివాస శాస్త్రి అయోధ్య తీర్పుతో అయోధ్యలోనే నివసిస్తున్నారు. అయోధ్య రామ మందిరం నిర్మాణానికి సమయం పట్టడంతో తిరిగి హైదరాబాద్ వచ్చి శ్రీరామ పాదుకలను చేయించి పాదయాత్రగా అయోధ్యకు బయలుదేరారు. ఇదంతా దైవ నిర్ణయం అని అంటున్నారు చల్లా శ్రీనివాస శాస్త్రి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…