PM Modi: ప్రధాని మోదీ మ్యాజిక్.. గూగుల్‌లో ఆ ప్రదేశం కోసం తెగ వెతుకుతున్న నెటిజన్లు..
ప్రధాని మోదీ.. రాజకీయాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా నెంబర్‌వన్.. ఆయన చేసే కొన్ని పనులు.. పర్యటనలు ఎల్లప్పుడూ ఆసక్తికరంగా మారుతుంటాయి.. అంతేకాకుండా.. అవి ప్రేరణగా కూడా నిలుస్తాయి.. అందుకే ప్రధాని మోదీ ఫాలోవర్లు కోట్లాది మంది ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం.. ఎక్స్ (ట్విట్టర్), ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా ఏదైనా ప్రధాని మోదీ షేర్ చేశారంటే..

ప్రధాని మోదీ.. రాజకీయాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా నెంబర్‌వన్.. ఆయన చేసే కొన్ని పనులు.. పర్యటనలు ఎల్లప్పుడూ ఆసక్తికరంగా మారుతుంటాయి.. అంతేకాకుండా.. అవి ప్రేరణగా కూడా నిలుస్తాయి.. అందుకే ప్రధాని మోదీ ఫాలోవర్లు కోట్లాది మంది ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం.. ఎక్స్ (ట్విట్టర్), ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా ఏదైనా ప్రధాని మోదీ షేర్ చేశారంటే.. లక్షల కొద్ది లైకులు, వేలాది కామెంట్లు వస్తుంటాయి.. రాజకీయంగానే కాకుండా.. ఫిట్‌నెస్, విద్య లేదా వ్యక్తుల స్ఫూర్తి జీవిత కథనాల గురించి అవగాహన కల్పించడానికి ప్రధాని మోడీ తరచూ సోషల్ ఉపయోగిస్తుంటారు. అయితే, ప్రజలు ప్రధాని మోదీని ఎలా అనుసరిస్తున్నారో అనే వాస్తవాన్ని నిరూపించేందుకు ఒక ఉదాహరణ మోదీ లక్షద్వీప్ పర్యటన.. గూగుల్ సెర్చ్ ట్రెండ్ లో ఇది టాప్ ప్లేస్ లో ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బుధవారం గూగుల్ సెర్చ్ ట్రెండ్ లో భారతదేశంలో అత్యధికంగా శోధించబడిన పదాలలో ‘లక్షద్వీప్’ తొమ్మిదవ స్థానంలో ఉంది.
ఎందుకంటే.. ప్రధాని లక్షద్వీప్‌లో పర్యటించిన తర్వాత ఇది జరిగింది. బుధవారం లక్షద్వీప్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. అక్కడి ప్రకృతి అందాలను ఆయన ఆస్వాదించారు. సముద్రం ఒడ్డున కూర్చుని కొంతసేపు సేద తీరారు. అంతేకాదు.. సముద్రంలో స్నార్కెలింగ్ (సాహసంతో కూడిన స్విమ్మింగ్) కూడా చేసి.. సముద్ర గర్భంలోని పగడపు దిబ్బలు, జీవరాశులను ప్రత్యక్షంగా వీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేశారు. ఇవి ఫాలోవర్లను తెగ ఆకట్టుకున్నాయి. లక్షదీవుల సౌందర్యం, అక్కడి ప్రజల మమకారం చూసి నేనింకా సంభ్రమాశ్చర్యంలోనే ఉన్నానని.. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణంతో మంత్రముగ్ధులను చేస్తున్నాయని.. ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సాహసాలు చేయాలనుకునేవారు.. లక్షద్వీప్‌ను చేర్చుకోండి.. అంటూ మోదీ ఫొటోలను షేర్ చేస్తూ రాసుకొచ్చారు..
And those early morning walks along the pristine beaches were also moments of pure bliss. pic.twitter.com/soQEIHBRKj
— Narendra Modi (@narendramodi) January 4, 2024
అయితే, ప్రధాని మోదీ షేర్ చేసినప్పటి నుంచి లక్షద్వీప్ టాప్ సెర్చ్ ప్లేస్ లోకి వెళ్లిపోయింది.. గూగుల్ లో లక్షలాది మంది లక్షద్వీప్ ను సెర్చ్ చేశారు. నివేదికల ప్రకారం బుధవారం.. ‘లక్షద్వీప్ ద్వీపం’, ‘అండమాన్’, ‘లక్షద్వీప్ ఫ్లైట్’, ‘లక్షద్వీప్ విమానాశ్రయం’, ‘కొచ్చి నుంచి లక్షద్వీప్’ వంటి కీలక పదాలపై 50,000 శోధనలు జరిగాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..