Corona Effect: దేశంలో రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా.. కేంద్రం కీలక విషయాలు వెల్లడి..
దేశంలో మరోసారి కరోనా డేంజర్ బెల్స్ మ్రోగిస్తోంది. చాప కింద నీరులా మెలమెల్లగా వ్యాపిస్తోంది. గత 24గంటల్లో దేశంలో 761 మందికి కరోనా సోకినట్లు,12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 4334 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు తాజాగా కేంద్రం తెలిపింది. చనిపోయిన 12 మందిలో కేరళకు చెందిన వారు ఐదుగురు కాగా.. కర్ణాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు ఉన్నారు.

దేశంలో మరోసారి కరోనా డేంజర్ బెల్స్ మ్రోగిస్తోంది. చాప కింద నీరులా మెలమెల్లగా వ్యాపిస్తోంది. గత 24గంటల్లో దేశంలో 761 మందికి కరోనా సోకినట్లు,12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 4334 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు తాజాగా కేంద్రం తెలిపింది. చనిపోయిన 12 మందిలో కేరళకు చెందిన వారు ఐదుగురు కాగా.. కర్ణాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు ఉన్నారు. ప్రస్తుతం కేసులతో పాటూ మరణాలు కూడా పెరిగిపోతున్నాయి.
ఇది చాలా మందిని ఆందోళనకు గురిచేస్తోంది. కొత్తగా వచ్చిన జేఎన్.1 వేరియంట్ ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి ప్రభుత్వాలు. దేశంలో ఇప్పటి వరకూ కోవిడ్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 5,33,385గా నమోదైంది. ప్రస్తుతం కరోనా మరణాల రేటు 1.18గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. మొన్నటి వరకూ క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనడంతో దీని వ్యాప్తి అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు వైద్యులు. రానున్నది పండుగ సీజన్ కావున అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.
ఇదిలా ఉంటే కేంద్రం దేశంలోని అన్ని రాష్ట్రాలకు కోవిడ్ హెచ్చరికలను జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోవిడ్‌పై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నాయి. అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని, ఆక్సిజన్ బెడ్ల కొరత లేకుండా చూసుకోవాలని సూచిస్తోంది. కరోనా టెస్టుల సంఖ్యలను విపరీతంగా పెంచాలని అన్ని జిల్లా ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేశారు అధికారులు. సామాజిక దూరంతోపాటు, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని చెబుతున్నారు. కొన్ని ప్రభుత్వం ఆసుపత్రుల్లో మాస్కులు ధరిస్తేనే లోపలికి అనుమతి ఇస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..