Assam: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది దుర్మరణం.! బొగ్గులోడు ట్రక్కును ఢీకొట్టిన బస్సు
అస్సాం రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోలాఘాట్‌లోని డెర్గావ్ సమీపంలో గల బలిజం ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున తీన్‌కతియాలోని తిలింగ మందిర్‌కు 45 మంది ప్రయాణికులు బస్సులో బయలుదేరారు. గోలాఘాట్ నుంచి తీన్‌కతియా వైపు వెళ్తుండగా అదే మార్గంలో ఎదురుగా వస్తున్న బొగ్గులోడు ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
అస్సాం రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోలాఘాట్‌లోని డెర్గావ్ సమీపంలో గల బలిజం ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున తీన్‌కతియాలోని తిలింగ మందిర్‌కు 45 మంది ప్రయాణికులు బస్సులో బయలుదేరారు. గోలాఘాట్ నుంచి తీన్‌కతియా వైపు వెళ్తుండగా అదే మార్గంలో ఎదురుగా వస్తున్న బొగ్గులోడు ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.