Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Health Department: రోగి అనుమతిస్తేనే ఐసీయూలోకి.! స్పష్టం చేసిన కేంద్రం ఆరోగ్యశాఖ.

Central Health Department: రోగి అనుమతిస్తేనే ఐసీయూలోకి.! స్పష్టం చేసిన కేంద్రం ఆరోగ్యశాఖ.

Anil kumar poka

|

Updated on: Jan 05, 2024 | 4:51 PM

ఇటీవల కాలంలో రోగులను ఐసీయూలో ఉంచి చికిత్స చేయడం బాగా పెరిగిపోయింది. ఎలాంటి అనారోగ్యమైనా ముందు ఐసీయూలోకి తరలిస్తున్నారు. దీనికి చెక్‌ పెడుతూ కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రోగులను ఐసీయూలో చేర్చుకోవడంపై 24 మంది నిపుణుల బృందం ఈ మార్గదర్శకాలను రూపొందించినట్టు తెలిపింది. రోగి నిరాకరిస్తే ఆసుపత్రి యాజమాన్యాలు ఐసీయూలో చేర్చుకోవడానికి వీల్లేదని కేంద్రం స్పష్టం చేసింది. పేషెంట్ బంధువులు అభ్యంతరం తెలిపినా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని తెలిపింది.

ఇటీవల కాలంలో రోగులను ఐసీయూలో ఉంచి చికిత్స చేయడం బాగా పెరిగిపోయింది. ఎలాంటి అనారోగ్యమైనా ముందు ఐసీయూలోకి తరలిస్తున్నారు. దీనికి చెక్‌ పెడుతూ కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రోగులను ఐసీయూలో చేర్చుకోవడంపై 24 మంది నిపుణుల బృందం ఈ మార్గదర్శకాలను రూపొందించినట్టు తెలిపింది. రోగి నిరాకరిస్తే ఆసుపత్రి యాజమాన్యాలు ఐసీయూలో చేర్చుకోవడానికి వీల్లేదని కేంద్రం స్పష్టం చేసింది. పేషెంట్ బంధువులు అభ్యంతరం తెలిపినా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని తెలిపింది. నిపుణుల బృందం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం.. ఐసీయూ చికిత్స వద్దనుకునేవారు లివింగ్‌ విల్‌ను రాతపూర్వకంగా తెలియజేస్తే ఆ విభాగంలో చేర్చుకోకూడదని సూచించారు. వ్యాధి లేదా అనారోగ్యంతో మరణం అంచులకు చేరినవారి ఆరోగ్యం ఏ మాత్రం మెరుగుపడే అవకాశం లేనప్పుడు వారిని ఐసీయూల్లో ఉంచడం వల్ల ఉపయోగం లేదన్నారు. ఐసీయూ కోసం ఎదురుచూస్తున్న రోగుల రక్తపోటు, శ్వాస రేటు, హృదయ స్పందన, శ్వాస తీరు, ఆక్సిజన్‌ శాచురేషన్‌, మూత్ర పరిమాణం, నాడీ వ్యవస్థ పనితీరు వంటి అంశాలను పరిశీలించి ఐసీయూలో చేర్చుకోవడంపై నిర్ణయం తీసుకోవాలి. తీవ్ర అనారోగ్యం కారణంగా నిశిత పర్యవేక్షణ అవసరమైన రోగులు, అవయవ వైఫల్యం, ఆరోగ్య పరిస్థితి క్షీణించే అవకాశమున్న వ్యాధులతో బాధపడేవారిని ఐసీయూల్లో చేర్చుకోవాలి. మహమ్మారులు, విపత్తుల సమయంలో వనరుల పరిమితి ఆధారంగా రోగులను ఐసీయూల్లో ఉంచే అంశంపై నిర్ణయం తీసుకోవాలి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.