AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పెళ్లయిన రాత్రే వధువుకు కడుపు నొప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్లగా మైండ్ బ్లాంక్ అయ్యే న్యూస్

అయ్య బాబోయ్.. పాపం ఆ వరుడి పరిస్థితి తలుచుకుంటే నిజంగా జాలి వేస్తుంది. అంత గ్రాండ్‌గా పెళ్లి చేస్తే తెల్లారికే సరికే అంతా తుష్ అయ్యింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

Telangana: పెళ్లయిన రాత్రే వధువుకు కడుపు నొప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్లగా మైండ్ బ్లాంక్ అయ్యే న్యూస్
Bride
Ram Naramaneni
|

Updated on: Jun 30, 2023 | 4:02 PM

Share

ఇది మాములు న్యూస్ కాదు. చదివితే మీ బుర్ర బ్లాంక్ అవుతుంది. గ్రేటర్ నోయిడాలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తి ఈ వారం ప్రారంభంలో తెలంగాణలోని సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లయిన రోజు రాత్రి యువతి సడన్‌గా కడుపులో నొప్పితో అల్లాడిపోయింది. పెళ్లి సందర్భంగా ఫుడ్ సరిగ్గా తినలేదు.. గ్యాస్ వల్ల ఏమో అనుకున్నారు. దగ్గర్లోని మెడికల్ స్టోర్‌లో ట్యాబ్లెట్స్ తెచ్చి ఇచ్చారు. ఆ తర్వాత కూడా పెయిన్ ఏ మాత్రం తగ్గలేదు. దీంతో వరుడి ఫ్యామిలీ మెంబర్స్ ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమె భర్త, అత్తమామలకు నిర్ఘాంతపోయే న్యూస్ చెప్పారు.  కొత్త పెళ్లి కూతురు ఏడు నెలల గర్భవతి అని.. చావు కబురు చల్లగా చెప్పేశారు. దీంతో ఆమె భర్తతో పాటు అత్తమామలకు ప్రపంచం తలకిందులైనట్లు అయిపోయింది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే…  ఒకరోజు తర్వాత ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

యువతి కుటుంబానికి ఆమె గర్భం గురించి తెలిసినా కూడా.. వరుడితో పాటు అతని కుటుంబ సభ్యలుకు తెలియకుండా విషయం దాచి పెట్టి… జూన్ 26, సోమవారం నాడు వివాహం చేశారు. పెళ్లికి ముందు ఇటీవలే తమ కుమార్తెకు కిడ్నీ స్టోన్స్  తొలగించే శస్త్రచికిత్స జరిగిందని, అందుకే ఆమె కడుపు వాచి.. ఎత్తుగా కనిపిస్తుందని..  వరుడి బంధువులకు తెలిపారు. కానీ పెళ్లయిన రోజు రాత్రే గుట్టు వీడిపోయింది.  అయితే ఇరు కుటుంబాలు ఒక అంగీకారానికి వచ్చి.. పోలీసులకు ఫిర్యాదు చేయకూడదని నిర్ణయించాయి. వధువు కుటుంబీకులకు సమాచారం అందించగా, వారు  సికింద్రాబాద్ నుంచి వచ్చి.. కుమార్తెతో పాటు ఆమె బిడ్డను వెంట తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందిందని కానీ ఎవరూ ఫిర్యాదు చేయలేదని దన్‌కౌర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సంజయ్ సింగ్ వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..

Follow Us
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..