మన వైమానిక దళానికి మరో బ్రహ్మాస్త్రం, పవర్‌ఫుల్‌ దేశీయ యుద్ధ విమానం, వచ్చే ఏడాది అందుబాటులోకి తేజస్‌ మార్క్‌- 2

తేజస్‌ సిరీస్‌లో అప్డేటెడ్‌ ఇండియన్‌ మేడెడ్‌ తేజస్‌ మార్క్‌ 2 ని వచ్చే ఏడాది ఆగస్టు - సెప్టెంబరు నాటికి అందుబాటులోకి తేబోతోంది హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌. పవర్‌ఫుల్‌ ఇంజిన్‌, ఎక్కువ బరువుని..

మన వైమానిక దళానికి మరో బ్రహ్మాస్త్రం,  పవర్‌ఫుల్‌ దేశీయ యుద్ధ విమానం,  వచ్చే ఏడాది అందుబాటులోకి తేజస్‌ మార్క్‌- 2
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 01, 2021 | 1:46 AM

తేజస్‌ సిరీస్‌లో అప్డేటెడ్‌ ఇండియన్‌ మేడెడ్‌ తేజస్‌ మార్క్‌ 2 ని వచ్చే ఏడాది ఆగస్టు – సెప్టెంబరు నాటికి అందుబాటులోకి తేబోతోంది హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌. పవర్‌ఫుల్‌ ఇంజిన్‌, ఎక్కువ బరువుని మోయగలిగే సామర్థ్యం, ఎలక్ట్రానిక్‌ వార్‌ ఫేర్‌ సిస్టమ్‌, ఇతర అత్యాధునిక స్టాండర్డ్స్‌తో తేజస్ మార్క్‌-2ని రూపొందిస్తున్నట్లు హెచ్‌ఏఎల్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌.మాధవన్‌ ప్రకటించారు. ఈ యుద్ధ విమాన హైస్పీడ్‌ ట్రయల్స్‌ 2023లో నిర్వహిస్తారు. ప్రస్తుతమున్న తేజస్‌ మార్క్‌ వన్‌ కంటే తేజస్‌ మార్క్‌ టూ మరింత పవర్‌ఫుల్‌.

తేజస్ మార్క్ వన్‌ ఏ యుద్ధ విమానమే. చైనా జేఎఫ్ ​- 17 కంటే ఎన్నోరెట్లు శక్తిమంతమైంది. దానికంటే అత్యాధునికం కావటంతో… మన వైమానిక దళానికి మరో బ్రహ్మాస్త్రం అందుబాటులోకి వస్తున్నట్లే. 2025 నాటికి తేజస్ మార్క్-2 విమానాల ఉత్పత్తి ప్రారంభించబోతోంది హెచ్‌ఏఎల్‌. తేజస్‌ ప్రాజెక్ట్‌ కోసం 48వేల కోట్లను కేటాయించారు. ఉత్పత్తిని వేగవంతం చేయడానికి HAL.. నాసిక్‌, బెంగళూరు డివిజన్లలో రెండో తయారీ యూనిట్లను సిద్ధం చేసింది. తేలికపాటి యుద్ధవిమానాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమమైందిగా గుర్తింపు పొందింది తేజస్‌.

అలవోకగా ఈ విమానం 3వేల500 కిలోల ఆయుధాలను తీసుకెళ్లగలదు. భూమికి 15 కిలోమీటర్ల ఎత్తున సూపర్‌సానిక్‌ వేగంతో ప్రయాణిస్తూ దాడులు చేయగలగడం తేజస్‌ ప్రత్యేకత. గాల్లోనే ఇంధనం నింపుకొనే సామర్థ్యం దీనికుంది. సరికొత్త తేజస్‌ విమానాల్లో అత్యాధునిక AESA రాడార్లను వినియోగించనున్నారు. శత్రుదేశాల ఎలక్ట్రానిక్‌ జామింగ్‌ వ్యవస్థను సమర్థంగా తట్టుకొని పని చేస్తుంది తేజస్‌ యుద్ధవిమానం.