Tamil Nadu: తమిళనాడు కొత్త రచ్చ.. వక్ఫ్‌బోర్డు చేసిన ఒక్క ప్రకటనతో తీవ్ర అలజడి.. ఫైర్ అవుతున్న బీజేపీ..
Tamil Nadu: మసీదులు.. మందిరాల మధ్య వివాదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. వారణాసి జ్ఞానవాపీ మసీదు అంశంపై వివాదం కొనసాగుతుండగానే..

Tamil Nadu: మసీదులు.. మందిరాల మధ్య వివాదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. వారణాసి జ్ఞానవాపీ మసీదు అంశంపై వివాదం కొనసాగుతుండగానే..తాజాగా తమిళనాడులో మరో కాంట్రవర్సీ షురూ అయింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అవును, తమిళనాడులో మరో వివాదం మొదలైంది. బీజేపీ, వక్ఫ్ బోర్డ్ మధ్య అగ్గి రాజుకుంది. ఐతే ఈసారి చోళుల కాలం నాటి చంద్రశేఖర ఆలయ భూముల వంతొచ్చింది. 18 గ్రామాలకు సంబంధించిన ఆ భూములన్నీ తమకే సొంతమని వక్ఫ్‌బోర్డ్ చేసిన ప్రకటన ఇరువర్గాల మధ్య చిచ్చుపెట్టింది. వక్ఫ్ బోర్డ్ ప్రకటనపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పురాతన ఆలయాలకు సంబంధించిన భూములు వక్ఫ్‌బోర్డ్‌కు ఎలా చెందుతాయని ప్రశ్నిస్తోంది.
ఐతే ఆలయాల అభివృద్ధికి తాము భూములను దానం చేశామని, తమ అనుమతి లేనిదే భూములను రిజిస్టర్ చేయడానికి వీల్లేదంటోంది వక్ఫ్‌బోర్డ్. ఈ వివాదంతో అప్రమత్తమైన తిరుచ్చి కలెక్టర్.. భూములకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం తిరుచ్చి శ్రీరంగం ఆలయ ఆధీనంలో ఉంది చంద్రశేఖర ఆలయం. తిరుచెంతురై గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న 18 గ్రామాల్లో వేలాది ఎకరాల భూములున్నాయి. ఆ భూములన్నీ తమవే అంటోంది వక్ఫ్ బోర్డ్. ఆ గ్రామాల్లో ఉన్న స్థలాలను అమ్మాలంటే వక్ఫ్ బోర్డ్ అనుమతి తీసుకోవాలని తేల్చి చెప్పింది. దీంతో తరాలుగా ఉన్న ఆ భూములు తమవి కావని, అవి మాకే సొంతమని వక్ఫ్ బోర్డ్ చెప్పడంతో టెన్షన్ పడుతున్నారు స్థానికులు. కావేరీ నది ఒడ్డున ఉన్న తిరుచెంతురై గ్రామం..1500 ఏళ్ల క్రితమే ఉందని, కానీ ఇస్లాం కేవలం 1300ఏళ్ల క్రితం వచ్చిందని, అలాంటప్పుడు ఆ భూములు వక్ఫ్ బోర్డ్ మావని ఎలా చెబుతుందని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆ భూములపై జిల్లా కలెక్టర్ సర్వేకు ఆదేశించడంతో ఏం తేలుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




