AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Murder in Tamilnadu: కూతురిని పెళ్లి చేసుకుంటానని ఇంటికి వచ్చిన యువకుడు.. యువతి బంధువులు ఏం చేశారంటే..

Murder in Tamilnadu: తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకుంటామని అన్నందుకు ప్రియురాలి కుటుంబ సభ్యులు...

Murder in Tamilnadu: కూతురిని పెళ్లి చేసుకుంటానని ఇంటికి వచ్చిన యువకుడు.. యువతి బంధువులు ఏం చేశారంటే..
Crime
Shiva Prajapati
|

Updated on: Jun 24, 2021 | 4:05 PM

Share

Murder in Tamilnadu: తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకుంటామని అన్నందుకు ప్రియురాలి కుటుంబ సభ్యులు ప్రియుడిని కొట్టి చంపేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. దిండిగల్ జిల్లాలోని పుడుపట్టి ప్రాంతానికి చెందిన భారతీరాజా.. హోటల్ మేనేజ్‌మెంట్ చదివిన తరువాత సిరుమలైలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో పని చేస్తున్నాడు. అయితే, భారతీరాజా.. ముంగిల్‌పట్టిలోని ముల్లైనగర్‌కు చెందిన పరమేశ్వరి అనే యువతిని ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం చివరికి యువతి ఇంట్లో తెలిసింది. వారు పెళ్లి చేసుకుంటామని చెప్పగా.. నిరాకరించారు. ఈ క్రమంలోనే పరమేశ్వరికి మరో వ్యక్తితో పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు.

ఈ విషయాన్ని పరమేశ్వరి తన ప్రియుడు భారతీరాజకు తెలుపగా.. అతను తన స్నేహితులతో కలిసి పరమేశ్వరి నివాసానికి వచ్చాడు. భారతీరాజా రాకను గమనించిన పరమేశ్వరి తల్లిదండ్రులు, ఆమె సోదరుడు మలైచామి, బంధువులు.. ఆరుబయటే అతనితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ ఘర్షణ నేపథ్యంలో కోపోద్రిక్తుడైన మలైచామి.. భారతిరాజా తలపై రాయితో బలంగా కొట్టాడు. దాంతో తీవ్రంగా గాయపడిన భారతీరాజా.. ఆస్పత్రికి తరలించే క్రమంలో ప్రాణాలు విడిచాడు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భారతీరాజా తల్లిదండ్రుల ఫిర్యాము మేరకు పరమేశ్వరి తల్లిదండ్రులు రాసు, అలకునాచి, సోదరులు మలైచామి, బాలకుమార్‌ లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితులను నాథమ్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Also read:

nirudh Ravichander: తెలుగులో విజయాలు లేవు… అయినా అనిరుధ్‌ వెంటే టాలీవుడ్‌ టాప్‌ హీరోలా..? ( వీడియో )

Atal Pension Yojana: 60 ఏళ్లకు పెన్షన్ పొందాలనుకుంటున్నారా అయితే కేంద్రం అందించే ఈ స్కీమ్ లో చేరితే సరి..

Karnam Malleswari: ఒలింపిక్స్ విజేతలను తయారు చేయడమే లక్ష్యం.. ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీ కరణం మల్లీశ్వరి..