Atal Pension Yojana: 60 ఏళ్లకు పెన్షన్ పొందాలనుకుంటున్నారా అయితే కేంద్రం అందించే ఈ స్కీమ్ లో చేరితే సరి..

Atal Pension Yojana: కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో చేరిన వారు 60 ఏళ్లకు పెన్షన్ గా ప్రతి నెలా డబ్బులను పొందవచ్చు. మోడీ సర్కార్ అందిస్తున్న ఈ స్కీమ్ గురించి..

Atal Pension Yojana: 60 ఏళ్లకు పెన్షన్ పొందాలనుకుంటున్నారా అయితే కేంద్రం అందించే ఈ స్కీమ్ లో చేరితే సరి..
Atal Pension Yojana
Follow us
Surya Kala

|

Updated on: Jun 24, 2021 | 3:36 PM

Atal Pension Yojana: కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో చేరిన వారు 60 ఏళ్లకు పెన్షన్ గా ప్రతి నెలా డబ్బులను పొందవచ్చు.  మోడీ సర్కార్ అందిస్తున్న ఈ స్కీమ్ గురించి వివరాలను తెలుసుకుందాం..

కేంద్ర ప్రభుత్వం రు అటల్ పెన్షన్ యోజన పధకాన్ని అందిస్తుంది. ఈ స్కీమ్ లో చేరిన వారు ప్రతి నెలా రూ.5 వేలు పొందొచ్చు. అయితే 60 ఏళ్లు దాటిన తర్వాతనే ప్రతి నెలా డబ్బులు పెన్షన్ కింద వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అసంఘటిత రంగంలో పని చేసే వారు లక్ష్యంగా తీసుకొచ్చింది. వీరికి ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఆవిష్కరించింది. మీరు ప్రతి నెలా రూ.5 వేలు పొందాలని భావిస్తే.. మీరు ప్రతి నెలా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మీరు అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరితే నెలకు కనీసం రూ.1000 పెన్షన్ పొందొచ్చు. రూ.2,000, రూ.3 వేలు, రూ.4,000, రూ.5 వేలు పెన్షన్ కూడా తీసుకోవచ్చు.

ఈ పథకంలో చేరిన వారు నెలనెలా కట్టే నగదును బట్టి.. 60 ఏళ్ల తర్వాత మనకు వచ్చే పెన్షన్ ఆధారపడి ఉంటుంది. 18 ఏళ్ల వయసులో ఉన్న వారు రూ.5 వేలు పెన్షన్ పొందాలని భావిస్తే.. నెలకు రూ.210 చెల్లించాల్సి ఉంటుంది. అదే మీరు నెలకు రూ.1000 పొందాలని భావిస్తే.. నెలకు రూ.42 కట్టాల్సి ఉంటుంది.

ఈ పథకంలో 18 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న వారు చేరవచ్చు. ఈ పథకం ద్వారా లబ్ది పొందాలనుకునే వారు బ్యాంకులకు వెళ్లి కూడా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI సహా ఇతర బ్యాంకులు కూడా అటల్ పెన్షన్ యోజన పథకాన్ని అందిస్తున్నాయి.

Also Read: విటమిన్ ‘సి’ అధికంగా ఉండే వాక్కాయ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో