Tamil Nadu Elections 2021: అభిమానులపై ‘తలా’ అజిత్ ఆగ్రహం.. అభిమాని సెల్‌ఫోన్ లాక్కుని..!
Assembly Elections 2021: తమిళనాడులో అసెంబ్లీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటేసేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు....
Assembly Elections 2021: తమిళనాడులో అసెంబ్లీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటేసేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. అటు సినీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో తలా అజిత్, ఆయన సతీమణి షాలినితో కలిసి తిరువాన్మయూర్‌లో ఓటేశారు. ఇక ఓటు వేసిన తర్వాత పోలింగ్ కేంద్రం నుంచి బయటికి వచ్చిన అజిత్‌తో సెల్ఫీ దిగేందుకు ఒక్కసారిగా అభిమానులు ఎగబడ్డారు.
దీనితో కొంచెం ఇబ్బందికి గురైన అజిత్.. ఓ అభిమాని సెల్‌ఫోన్ లాక్కుని జేబులో పెట్టుకున్నారు. అంతేకాకుండా వారందరిని అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఎప్పూడూ సింప్లిసిటీతో ఉండే అజిత్ ఒక్కసారిగా అభిమానుల తాకిడి ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. పోలింగ్ సమయంలో క్యూలైన్‌లో ఉండి మరీ ఓటు వేసే అజిత్.. ఒక్కసారిగా ఎగబడిన అభిమానులతో కాస్త అసహనానికి గురయ్యారు.
Also Read:
Viral: నిమిషాల్లో ప్రాణాలు తీసే మొక్క.. పాము కంటే అత్యంత ప్రమాదకరం.. తస్మాత్ జాగ్రత్త.!
”నువ్వు తోపు.. అయితే నాకేంటి”.. మొసలిని లెక్క చేయని జీబ్రా.. ఏం జరిగిందంటే.!
అద్భుత రికార్డు.. 13 బంతుల్లో 10 వికెట్లు పడగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్.. అతడు ఎవరంటే.!
Shocking: మొక్క కాదు “యమపాశం’..తాకితే తగలబెడుతుంది.. అసలు ఎందుకో తెలుసా.?