Shruti Haasan: కమల్ హసన్‌ కుమార్తె శ్రుతి హసన్‌పై బీజేపీ ఫిర్యాదు.. అక్రమంగా పోలింగ్ బూత్‌లోకి..!

Tamil Nadu Elections 2021: మక్కల్ నీది మయం(ఎంఎన్ఎం) చీఫ్ కమల్ హసన్‌ కుమార్తె, నటి శ్రుతి హసన్‌పై ఎలక్షన్ కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది..

Shruti Haasan: కమల్ హసన్‌ కుమార్తె శ్రుతి హసన్‌పై బీజేపీ ఫిర్యాదు.. అక్రమంగా పోలింగ్ బూత్‌లోకి..!
Kamal Haasan
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 07, 2021 | 11:55 AM

Tamil Nadu Elections 2021: మక్కల్ నీది మయం(ఎంఎన్ఎం) చీఫ్ కమల్ హసన్‌ కుమార్తె, నటి శ్రుతి హసన్‌పై ఎలక్షన్ కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. నిబంధనలకు విరుద్దంగా ఆమె తన తండ్రితో కలిసి కోయంబత్తూరు సౌత్‌లోని పోలింగ్ బూత్‌ను అక్రమంగా సందర్శించినట్లు ఆరోపించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎం చీఫ్ కమల్ హసన్ కోయంబత్తూరు సౌత్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఎన్నికల్లో ఓటేసిన అనంతరం ఆయన.. తన కూతుళ్లు అక్షర, శ్రుతి హసన్‌తో కలిసి నేరుగా కోయంబత్తురు సౌత్‌ నియోజకవర్గానికి వెళ్లారు. ఓటింగ్ సరళిని సమీక్షించడానికి నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఆ సమయంలో కమల్ హసన్ వెంట శ్రుతి హసన్ కూడా ఉండటంతో.. ఆమె అక్రమంగా పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించారని.. క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

ఈ మేరకు కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్ధి వనతి శ్రీనివాసన్ తరపున బీజేపీ జిల్లా అధ్యక్షుడు నందకుమార్ జిల్లా ఎన్నికల అధికారికి లేఖ రాశారు. పోలింగ్ కేంద్రాల్లోకి బూత్ ఏజెంట్లు తప్ప ఎవరూ వెళ్లకూడదనే రూల్ ఉందని.. ఆ నిబంధనను శ్రుతి హసన్ అతిక్రమించిందని.. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

Also Read:

‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌’.. దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే.!

ఈ ఫోటోలోని ఇద్దరు హీరోయిన్స్‌ను గుర్తు పట్టారా.? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్.!

ఇంటి గుమ్మంలో తిష్టవేసిన సింహాలు.. డోర్ తీసి కంగుతిన్న యజమాని.. కట్ చేస్తే ఊహించని సంఘటన.!