Karnataka Bus strike: కదలని చక్రాలు.. ఆగిన బస్సులు.. కేఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె.. సమస్యల పరిష్కారానికి డిమాండ్
కర్ణాటక రోడ్డు రవాణసంస్థ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. తమ డిమాండ్లను పరిష్కాలంటూ బుధవారం ఉదయం నుంచి సమ్మెకు దిగారు.
Bus strike in Karnataka: కర్ణాటక రోడ్డు రవాణసంస్థ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. తమ డిమాండ్లను పరిష్కాలంటూ బుధవారం ఉదయం నుంచి సమ్మెకు దిగారు. కేఎస్‌ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కర్ణాటక స్టేట్ రోడ్డు రవాణ సంస్థ , బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్, నార్త్ వెస్ట్రన్ కర్ణాటక రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్, నార్త్ ఈస్ట్రన్ కర్ణాటక రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ ఉద్యోగులు 6వ పే కమిషన్ ప్రకారం జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు శ్రీకారం చుట్టారు.
ఈ ఉదయం నుంచి బస్సు సర్వీసులను నిలిపివేసిన సిబ్బంది, సమ్మె ప్రారంభించారు. మరోవైపు, కేఎస్ఆర్టీసీ కార్మికుల 9 డిమాండ్లలో 8 డిమాండ్లను తాము అంగీకరించామని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప చెప్పారు. కేఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. వెంటనే ఉపసంహరించుకోవాలని సీఎం కోరారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలావుంటే, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనంగా రైళ్లు నడపాలని కర్ణాటక సర్కారు రైల్వే శాఖను కోరింది. సమ్మె కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా కలబురాగీ, బెల్గావి, హుబ్లీ, మైసూర్ ప్రాంతాల్లో ప్రైవేటు బస్సులను ప్రత్యామ్నాయంగా తిప్పాలని కర్ణాటక సర్కారు నిర్ణయించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ కేఎస్ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడంపై కర్ణాటక చీఫ్ సెక్రటరీ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మెకు దిగిన కేఎస్ఆర్టీసీ కార్మికులపై కఠిన చర్యలు తీసుకుంటామని చీఫ్ సెక్రటరీ హెచ్చరించారు.
Read Also… Telangana corona: తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. రెండు వేలకు చేరువలో పాజిటివ్ కేసులు..