Telangana corona: తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. రెండు వేలకు చేరువలో పాజిటివ్ కేసులు..

తెలంగాణలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో కొత్త కేసులు వెయ్యి దాటాయి.

Telangana corona: తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. రెండు వేలకు చేరువలో పాజిటివ్ కేసులు..
Coronavirus
Follow us

|

Updated on: Apr 07, 2021 | 10:46 AM

తెలంగాణలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో వెయ్యి దాటి కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 2 వేలకు చేరవలో నమోదయ్యాయి. సోమవారం రాత్రి 8గంటల నుంచి మంగళవారం రాత్రి 8గంటల వరకు రాష్ట్రంలో కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,914 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా మంగళవారం ఒక్కరోజే మరో ఐదుగురు కరోనా బారినపడి ప్రాణాలను కోల్పోయారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా అంతకంతకు వైరస్ విస్తరిస్తూనే ఉంది. కాగా, గత 24గంటల్లో మహమ్మారి బారినుంచి 285 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,16,649కి చేరుకున్నాయి. ఇక, ఇప్పటివరకు కరోనాను జయించలేక మొత్తం 1,734 మంది మృత్యువాత పడ్డారు. మరో 3.03 లక్షల మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో ప్రస్తుతం 11,617 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 6,634 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 393 , మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 205, నిజామాబాద్‌ జిల్లాలో 179, రంగారెడ్డి జిల్లాలో 169 చొప్పున నమోదయ్యాయి. కాగా, నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 74,274 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

Telangana Corona Cases

Telangana Corona Cases

Read Also…  Coronavirus: భారత్‌లో కరోనా విజృంభణ.. మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు