చెప్పేకొద్దీ అంత పంతం ఎందుకు.. కేంద్రానికి సీఎం మాస్ వార్నింగ్..!

దశాబ్దాలుగా జరుగుతున్న హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని లెక్కచేయకుండా మాపై బలవంతంగా హిందీని రుద్దాలని చూస్తే మేము ఊరుకోమని అన్ని ప్రభుత్వాలు కేంద్రాన్ని హెచ్చరించాయి.

చెప్పేకొద్దీ అంత పంతం ఎందుకు.. కేంద్రానికి సీఎం మాస్ వార్నింగ్..!
Cm Mk Stalin
Follow us
Ch Murali

| Edited By: Balaraju Goud

Updated on: Nov 19, 2024 | 4:27 PM

ప్రాంతీయవాదాన్ని బలంగా వినిపించడంలో తమిళనాడు ప్రభుత్వం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. అది భాషాపరమైన అంశమైన సాంప్రదాయాలైనా.. కేంద్రం తీసుకున్న నిర్ణయాల్లో అది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చని అంశమైతే అందుకోసం ఎంత దూరమైనా పోరాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. గతంలో జల్లికట్టు విషయంలో సుప్రీంకోర్టు నిషేధం ఉన్న యావత్ తమిళనాడు ప్రజలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేసి, కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా అనుమతినిచ్చేదాకా పోరాటం కొనసాగింది. అలాంటిది కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని లెక్కచేయకుండా మాపై బలవంతంగా హిందీని రుద్దాలని చూస్తే మేము ఊరుకోమని అన్ని ప్రభుత్వాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. తాజాగా మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్రానికి మాస్ వార్నింగ్ ఇచ్చారు.

భారతదేశానికి స్వాతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కూడా తమిళ రాష్ట్రంలో హిందీ భాష అమలు చేయడానికి వ్యతిరేకిస్తూ పోరాటాలు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. 1960లో ద్రవిడ కళగం అనే పార్టీ నుంచి విడిపోయి ద్రవిడ మున్నేట్ర కలగంగా ఏర్పడ్డ డిఎంకె అప్పటి నుంచి హిందీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూనే ఉంది. ఆ తర్వాత వచ్చిన ఏడీఎంకే ప్రభుత్వం కూడా తమిళుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని సెంటిమెంట్ అంశంగా భావించి హిందీని వ్యతిరేకిస్తూనే వచ్చింది. ఇటీవల కొద్ది కొద్దిగా తమిళనాడులో హిందీ అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది.

గతంలో తమిళనాడులో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు రైల్వేస్టేషన్‌లో బోర్డుల్లో తమిళం ఇంగ్లీషు అక్షరాలు మాత్రమే ఉండేవి.. మూడేళ్ల క్రితం నుంచి రైల్వే స్టేషన్‌లో హిందీ అక్షరాల్లో బోర్డులను ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల వాటిని వ్యతిరేకించేవారు తొలగించినప్పటికీ మిగిలిన చోట్ల హిందీ బోర్డులు కొనసాగుతూనే ఉన్నాయి.

తాగారా చెన్నైలో ఉన్న ఎల్ఐసి కార్యాలయం.. ఎల్ఐసి వెబ్‌సైట్‌లో ఆంగ్లం, తమిళం ఆప్షన్ తొలగించి హిందీ మాత్రమే ఉంచడాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపించింది. దశాబ్దాలుగా హిందీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న మాపై బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నాన్ని కేంద్రం పదే పదే చేస్తుండడానికి సీఎం స్టాలిన్ తప్పుపట్టారు. ప్రాంతీయ భాషలను తొలగించడమే కాకుండా ఇంగ్లీష్ ఎంచుకున్నా కూడా హిందీ భాషలోనే ఉండడం సరైనది కాదన్నారు. ఇది భారతదేశ వైవిధ్యాన్ని తుంగలో తొక్కి బలవంతంగా హిందీ భాషని మాపై వృద్ధి ప్రయోగమే తప్ప మరొకటి కాదని స్టాలిన్ అన్నారు. ఎల్ఐసి భారతీయులందరికీ ప్రోత్సాహంతో అభివృద్ధి చెందుతున్నప్పుడు మెజారిటీ ఖాతాదారులకు ద్రోహం చేసే అధికారం మీకు ఎక్కడిదని ప్రశ్నించారు. ఈ భాష దౌర్జన్యాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా కేంద్రానికి వ్యతిరేకంగా హిందీ పై తమిళనాడు చేస్తున్న పోరాటం మరోసారి తెరపైకి వచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే