Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu: డీఎంకే ఫైల్స్ 2 విడుదల.. తమిళ గడ్డపై సంచలనం సృష్టిస్తున్న కమలం పాలిటిక్స్..

దేశంలోనే తమిళనాడు రాజకీయాలు ఆసక్తిగా ఉంటాయి. అక్కడ ప్రజల తీర్పు మొదలు.. పార్టీల వైఖరి నుంచి ప్రతిదీ ప్రత్యేకమే. ఇక్కడ ఉన్నన్ని రాజకీయ పార్టీలు దేశంలోని మరెక్కడా ఉండవు. ఎలాంటి సందేహం లేకుండా శతాధిక పార్టీల ఏకైక రాష్ట్రం తమిళనాడు మాత్రమే. కొన్ని దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీలదే..

Tamil Nadu: డీఎంకే ఫైల్స్ 2 విడుదల.. తమిళ గడ్డపై సంచలనం సృష్టిస్తున్న కమలం పాలిటిక్స్..
Bjp Releases Dmk Files 2
Follow us
Ch Murali

| Edited By: Shiva Prajapati

Updated on: Jul 27, 2023 | 7:28 PM

దేశంలోనే తమిళనాడు రాజకీయాలు ఆసక్తిగా ఉంటాయి. అక్కడ ప్రజల తీర్పు మొదలు.. పార్టీల వైఖరి నుంచి ప్రతిదీ ప్రత్యేకమే. ఇక్కడ ఉన్నన్ని రాజకీయ పార్టీలు దేశంలోని మరెక్కడా ఉండవు. ఎలాంటి సందేహం లేకుండా శతాధిక పార్టీల ఏకైక రాష్ట్రం తమిళనాడు మాత్రమే. కొన్ని దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీలదే తమిళనాడులో హవా.. ద్రవిడ వాదం మెండుగా ఉండే తమిళనాడులో పార్టీ పేరులో కూడా ఆ పదం ఉండాల్సిందే. జాతీయ భాష హిందీని సైతం అంగీకరించని అక్కడ జాతీయ పార్టీల పెత్తనాన్ని కూడా సహించవు. ఏ జాతీయ పార్టీ అయినా మా ప్రాంతీయ పార్టీల మోచేతి కిందే ఉండాలన్న గట్టి పట్టు అక్కడ రుజువైన సందర్భాలు అనేకం. కేంద్రంలో ఏపార్టీ అధికారంలో ఉన్నా.. తమకు కావాల్సింది ఒత్తిడి తెచ్చి మరీ సాధించుకునే పరిస్థితి. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నన్నాళ్ళు ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా సఖ్యతగానే ఉండేది.

కానీ ఇప్పుడు సీన్ రివర్స్ లో ఉంది.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న డీఎంకే కి అస్సలు పడడం లేదు. తమిళనాడు బీజేపీ చీఫ్ గా అన్నామలై నియామకం అయ్యాక డీఎంకే పై బీజేపీ దూకుడు పెరిగింది. డీఎంకే అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అంటూ ఆరోపణలు చేస్తూ వచ్చిన అన్నామలై.. అక్రమాలకు పాల్పడుతున్నారంటూ వారి జాబితా కూడా బయట పెట్టారు. మూడు నెలల క్రితం డీఎంకే ఫైల్స్ పేరుతో లిస్ట్, కొన్ని ఆడియోలు కూడా మీడియాకు విడుదల చేశారు. ఆ జాబితాలో సీఎం స్టాలిన్ కుటుంబ సభ్యులు ఉండడం పొలిటికల్ కాక రేగింది.

బీజేపీ విడుదల చేసిన జాబితాలో డిఎంకె ముఖ్య నేతల అక్రమాలు, ఆస్తుల వివరాలు ప్రకటించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అన్నామలై. సీఎం స్టాలిన్, కుమారుడు ఉదయనిది స్టాలిన్, స్టాలిన్ అల్లుడు సబరీశన్ అక్రమాలు, ఆర్ధికమంత్రి పిటి త్యాగరాజన్ ఆడియో విడుదల చేశారు. ఆడియోలో ఉదయనిది స్టాలిన్, సబరీశన్ వేల కోట్లు అక్రమాలకు పాల్పడుతున్నారని మంత్రి ఫోన్ సంభాషణ ఆ ఆడియోలో ఉంది. ఆడియో నాది కాదని మంత్రి ప్రకటన విడుదల చేసినా జనంలో మాత్రం బీజేపీ ఆరోపణలు బలంగా వెళ్లాయి. ఉదయనిది స్టాలిన్.. అన్నామలైకు లీగల్ నోటీసులు పంపారు. దీంతో మరింత దూకుడు పెంచిన బీజేపీ తాజాగా డీఎంకే ఫైల్స్ 2 పేరుతో మరో లిస్ట్ విడుదల చేసింది.

డీఎంకే ఫైల్స్‌-2 పేరుతో వీడియో విడుదల చేసిన బీజేపీ.. రూ.5,600 కోట్లకు సంబంధించిన అవినీతి ఆరోపణలతో జాబితాను బయట పెట్టింది. డీఎంకే నేతల అవినీతిపై గవర్నర్‌కు అన్నామలై ఫిర్యాదు చేశారు. గతంలో సీఎం స్టాలిన్‌ కుమారుడు, అల్లుడితో పాటు.. మంత్రుల అవినీతి చిట్టాను విడుదల చేసిన బీజేపీ.. తాజాగా మరి కొందరి అక్రమాలను బయట పెట్టడం తమిళనాట పొలిటికల్ కాక మొదలైంది. మరి దీనిపై డీఎంకే నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..