AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చిన అతి పెద్ద భారీ తిమింగలం

అతి పెద్ద భారీ తిమింగలం సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. తమిళనాడు రామనాథపురం జిల్లాలోని వాలినోక్కం బీచ్ వద్దకు ఆదివారం అతిపెద్ద తిమింగలం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. విషయం తెలుసుకున్న స్థానికులు, వెంటనే పోలీసులకు, అటవీశాఖ అధికారులకు..

సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చిన అతి పెద్ద భారీ తిమింగలం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 30, 2020 | 3:50 PM

Share

అతి పెద్ద భారీ తిమింగలం సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. తమిళనాడు రామనాథపురం జిల్లాలోని వాలినోక్కం బీచ్ వద్దకు ఆదివారం అతిపెద్ద తిమింగలం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. విషయం తెలుసుకున్న స్థానికులు, వెంటనే పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ భారీ తిమింగలం శరీరంపై గాయాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా ప్రస్తుతం ఇది బతికి ఉందా? లేదా అనేది తేలాల్సి ఉంది. ఈ రకం తిమింగలాలు అంతరించిపోతున్న జాబితాలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ అతి పెద్ద తిమిగలాన్ని చూడటం ఇదే మొదటిసారి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. కాగా జూన్ నెలలో 18 అడుగుల భారీ తిమింగలం కళేబరం ఇదే రామనాథపురం జిల్లాలోనే కొట్టుకు వచ్చింది. అనంతరం దీనికి పోస్టు మార్టం నిర్వహించి బీచ్‌లోనే పూడ్చిపెట్టారు అధికారులు.

Read More:

ఆసియాలో ఫస్ట్ టైం: కోవిడ్ రోగికి ఊపిరితిత్తుల మార్పిడి

ఇంకా డీప్‌ కోమాలోనే ప్రణబ్.. వెంటిలేటర్ మీద చికిత్స

బ్రేకింగ్: ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్

అన్నదాతలే మనకి గర్వకారణం.. ‘మన్‌కీ బాత్’లో ప్రధాని

Follow Us