హీరోయిన్‏గా 17 ఏళ్ల ప్రయాణం.. నేర్చుకున్న అతిపెద్ద పాఠం ఇదే.. శ్రుతి

Rajitha Chanti

Pic credit - Instagram

30  July 2026

భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి, గాయని శృతి హాసన్ తన సినీ ప్రయాణంలో 17 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.

విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తెగా చిత్రసీమలోకి అడుగుపెట్టినప్పటికీ, తన సొంత ప్రతిభ, వైవిధ్యమైన నటన, సంగీతంతో స్టార్ నటిగా ఎదిగారు.

2009లో హిందీ చిత్రం 'లక్' ద్వారా శృతి హాసన్ హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ తర్వాత 'అనగనగా ఓ ధీరుడు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు.

ప్రారంభంలో కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, పవన్ కళ్యాణ్ సరసన నటించిన 'గబ్బర్ సింగ్' సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది.

ఈ సినిమా సాధించిన ఘనవిజయం ఆమెకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలను తెచ్చిపెట్టింది. తెలుగు, తమిళ, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది.

17 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా శృతి హాసన్ తన అనుభవాలను, జ్ఞాపకాలను, పాఠాల గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 

ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో నేను నేర్చుకున్న అతిపెద్ద పాఠం ఏంటంటే, మన పట్ల మనం ఎప్పుడూ నిజాయితీగా ఉండటమని చెప్పుకొచ్చారు.

నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ ముందుకు సాగడమే అని అన్నారు. ప్రస్తుతం శ్రుతి హాసన్ సినిమాలు అంతగా నటించడం లేదు.