బాలీవుడ్ లో ఆ స్టార్ హీరోయిన్.. ప్రియమణి అక్క అని మీకు తెలుసా?
30-07-2026
Pic credit - Instagram
Phani Ch
హీరోయిన్ ప్రియమణి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు నటన, అభినయం, డ్యాన్స్, అందం అన్ని కళలు కలిగి ఉన్న నటి ఈ ముద్దుగుమ్మ.
తెలుగు లో ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో, గ్లామర్ రోల్స్ నటించింది ఈ చిన్నది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో వైవిధ్యమైన పాత్రలు ఇస్తోంది
కెరీర్ పరంగా మరియు పర్సనల్ లైఫ్ విషయంలో చాలా చక్కటి ప్లానింగ్ ముందుకుపోతుంది. మంచి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
సరిగ్గా హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో వివాహం చేసేసుకుంది. ప్రస్తుతం ప్రియమణి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.
ప్రియమణి అటు వెండితెరపై నటిస్తూనే బుల్లితెరపై కూడా మెరిసింది. పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించింది ఈ ముద్దుగుమ్మ.
ఇదిలా ఉంటే ప్రియమణి కుటుంబానికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం చాలా మందికి తెలియదు. ప్రియమణి అక్క కూడా సినీ రంగంలో ప్రముఖ హీరోయిన్ అనే విషయం చాలామందికి తెలియదు.
ఇంతకీ ఆ ఇద్దరు మరెవరో కాదు.. తెలుగు హీరోయిన్ ప్రియమణి, బీటౌన్ బ్యూటీ విద్యాబాలన్. అవును.. వీరిద్దరు కజిన్స్. సినిమాల్లోకి రాకముందే వీళ్లు బంధువులు.
అయితే వాళ్లు ఎప్పుడూ కూడా కలిసి కనిపించరు. అలాగే ఒకరితో ఒకరు స్నేహంగా.. మాట్లాడుతూ ఉండరు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి తమ బంధం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.